ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung వియత్నాంలో Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేసింది. రానున్న రోజుల్లో భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ప్రవేశించనుంది. Samsung Galaxy A25 5G స్మార్ట్ఫోన్ 8జిబి ర్యామ్, ఎగ్జినోస్ 1280 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ 12 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. సరే, ఓసారి Samsung Galaxy A25 5G ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందా పదండి.
Samsung Galaxy A25 5G ధర, కలర్ ఆప్షన్స్
- Samsung Galaxy A25 5G స్మార్ట్ఫోన్ వియత్నాంలో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్ ప్రస్తుతం వియత్నాం మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది.
- త్వరలోనే ఇతర మార్కెట్స్ లో అందుబాటులోకి రానుంది.
- Samsung Galaxy A25 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. దీని ధరను వియత్నాంలో VND 65,90,000 గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో సుమారు రూ.22,500 అని చెప్పవచ్చు. భారత మార్కెట్ లో లాంచ్ తర్వాత ధరలో మార్పు ఉండవచ్చు.
- Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ పర్సనాలిటీ యెల్లో, ఫ్యాంటసీ బ్లూ, ఆప్టిమిస్టిక్ బ్లూ, బన్ లిన్హ్ బ్లాక్ వంటి నాలుగు కలర్ ఆప్షన్స్ లో వియత్నాంలో విడుదలైంది. ఇప్పుడు Samsung Galaxy A25 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని ఈ చిప్ కలిగి ఉంది.
- కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A25 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ వంటి ఆప్సన్స్ ఉన్నాయి.
- సెక్యూరిటీ: Samsung Galaxy A25 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
