ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ లో Galaxy A25 5G ఫోన్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్లలో డిస్కౌంట్ పై విక్రయించబడుతోంది. 91mobiles కి ఆఫ్‌లైన్ రిటైలర్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం, గెలాక్సీ ఏ25 5జీ యొక్క రెండు వేరియంట్లపై రూ.2,913 ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ ఆఫర్ నేడు అనగా ఏప్రిల్ 17 నుంచి అమలులో ఉంటుంది.
Samsung Galaxy A25 5G డిస్కౌంట్ వివరాలు
Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.26,213 గా ఉంది. ప్రస్తుతం రూ.2,913 డిస్కౌంట్ తర్వాత రూ.23,300 గా ఉంది.
Samsung Galaxy A25 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.29,125 గా ఉండగా, ప్రస్తుతం రూ.2,193 డిస్కౌంట్ తర్వాత రూ.26,212 కి లభిస్తోంది.
Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.
కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
