
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A25 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ సైట్ గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy A25 5G ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. సరే, ఓసారి గీక్ బెంచ్ లిస్టింగ్ వివరాలు, రివీలైన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A25 5G గీక్‌బెంచ్ లిస్టింగ్
- Samsung Galaxy A25 5G డివైజ్ గీక్ బెంచ్ వెబ్ సైట్ లో SM-A256B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- ఈ డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 973 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 2106 పాయింట్లు స్కోర్ చేసింది.
- ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 1280 చిప్సెట్ తో Samsung Galaxy A25 5G డివైజ్ లిస్ట్ పై కనిపించింది.
- 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో Samsung Galaxy A25 5G హ్యాండ్సెట్ గీక్ బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Samsung Galaxy A25 5G లో 6.44-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి జీపీయూ ని వినియోగిస్తారని అంచనా.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A25 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఇంకా వేరే వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
- కెమెరా: Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఇతర సెన్సర్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
- బ్యాటరీ: Samsung Galaxy A25 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఈ ఫోన్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A25 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.











