Home News భారత్ లో Galaxy A32 ధరను తగ్గించిన Samsung

భారత్ లో Galaxy A32 ధరను తగ్గించిన Samsung

హైలైట్స్:

Samsung Galaxy A32 గతేడాది భారత్ లో లాంచ్ అయ్యింది. 6జిబి ర్యామ్ వేరియంట్, 8జిబి ర్యామ్ వేరియంట్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 6జిబి వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8జిబి వేరియంట్ ధర రూ.23,499 గా ఉంది. అయితే శాంసంగ్ ఇప్పుడు ఈ మిడ్-రేంజ్ 4జీ స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించింది.

అమెజాన్ లో ఈ రెండు వేరియంట్లు తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తగ్గిన ధరల వివరాలు చూద్దాం. 6జిబి ర్యామ్ మోడల్ తగ్గిన ధర రూ.18,500 గా ఉంది. 8జిబి ర్యామ్ వేరియంట్ తగ్గిన ధర రూ.18,749 గా ఉంది. ఈ ఫోన్ మూడు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: ఆసమ్ బ్లాక్, ఆసమ్ బ్లూ, ఆసమ్ వయొలెట్

Samsung Galaxy A32 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A32 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి. ఈ ఫోన్ 158.9 మిల్లీ మీటర్ల పొడవు, 73.6 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.4 మిల్లీ మీటర్ల మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy A32 లో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ అమర్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 3.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ మెమొరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ ఫీచర్లను చూస్తే, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జ్యాక్, డాల్బి అట్మాస్ ఉన్నాయి.

ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Samsung Galaxy A32 లో 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో లెన్స్, 5ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20ఎంపి కెమెరా ఉంది. ఈ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉండటం విశేషం.

ప్రస్తుతం 5జీ హవా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అందరూ 5జీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరైనా 5జీ ఫోన్ కి అప్‌గ్రేడ్ అవ్వాలనుకోవడం సహజమే. కానీ, తొలిదశలో 5జీ సేవలు మెట్రో నగరాలకే పరిమితం కానున్నాయి. మిగతా పట్టణాలు, గ్రామాలకు రావాలంటే ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు తక్కువ ధరలో శాంసంగ్ ఫోన్ కొనాలని అనుకునే వారు Samsung Galaxy A32 ని ప్రయత్నించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.