Home News గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Samsung Galaxy A34 5G

గూగుల్ ప్లే కన్సోల్ పై కనిపించిన Samsung Galaxy A34 5G

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G, గూగుల్ ప్లే కన్సోల్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్, ఆండ్రాయిడ్ 13, 6జిబి ర్యామ్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగిన Samsung Galaxy A34 5G
  • గ్లాస్ బ్యాక్, ట్రిపుల్ కెమెరా, టియర్ డ్రాప్ నాచ్ తో వస్తోన్న Samsung Galaxy A34 5G

త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A34 5G మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. లాంచ్ కి ముందు 91మొబైల్స్, Samsung Galaxy A34 5G ఫోన్ ని గూగుల్ ప్లే కన్సోల్ పై గుర్తించింది. లిస్టింగ్ ద్వారా ఫోన్ యొక్క హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్, డిజైన్ రెండర్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, టియర్ డ్రాప్ నాచ్, 6జిబి ర్యామ్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే తో వస్తోందని గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Samsung Galaxy A34 5G గూగుల్ కన్సోల్ లిస్టింగ్: స్పెసిఫికేషన్స్ డిజైన్

Samsung Galaxy A34 5G హార్డ్‌వేర్ జాబితా ద్వారా ఈ ఫోన్ మీడియాటెక్ కి సంబంధించిన చిప్సెట్ ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్సెట్ MT6877V/TTZA అనే మోడల్ నేమ్ ని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ కి అఫీషియల్ నేమ్.

2.5 గిగాహెర్ట్జ్ స్పీడ్ తో తిరిగే రెండు పెర్ఫామెన్స్ కోర్స్, 2 గిగాహెర్ట్జ్ వేగంతో తిరిగే 6 ఎఫిషియన్సీ కోర్స్ ఈ చిప్ లో ఉన్నాయి. ఈ ఆక్టా-కోర్ సీపీయూ, ఏఆర్ఎం మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ తో జతచేయబడింది. 6జిబి ర్యామ్ లో 5.8జిబి ర్యామ్ వాడుకోదగినది. లాంచ్ సమయంలో మరొక ర్యామ్ వేరియంట్ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. గూగుల్ ప్లే కన్సోల్ పై Samsung Galaxy A34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో కనిపించింది.

Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే ప్రీమియమ్ గానే కనిపిస్తోంది. Samsung Galaxy S23 5G ఫ్లాగ్షిప్ డివైజ్ ని ఇన్‌స్పైర్ అయ్యి Galaxy A34 5G ని రూపొందించినట్లు తెలుస్తోంది. Samsung Galaxy A34 5G యొక్క బ్యాక్ ప్యానెల్ ఫ్రాస్టెడ్ గ్లాస్ తో కనిపిస్తోంది. ఇంకా కెమెరాల చుట్టూ మెటాలిక్ రింగ్స్ ఉన్నాయి.

Samsung Galaxy A34 5G డివైజ్ ఫ్రంట్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, మినిమల్ బెజెల్స్, సన్నని చిన్ ఉన్నాయి. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. టాప్ సెంటర్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంది. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు. గూగుల్ ప్లే కన్సోల్ జాబితా ప్రకారం, Samsung Galaxy A34 5G స్మార్ట్ ఫోన్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2340 పిక్సెల్ రెజుల్యూషన్, 450పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.