
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది Galaxy A34 ని లాంచ్ చేసింది. లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ.30,999 గా ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ డివైజ్ ధర రూ.6,000 కు పైగానే తగ్గింది. గెలాక్సీ ఏ34 లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48ఎంపి ఓఐఎస్ కెమెరా, ఐపీ67 రేటింగ్ ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A34 ధర తగ్గింపు వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A34 ధర తగ్గింపు వివరాలు
శాంసంగ్ సంస్థ యొక్క అధికార వెబ్‌సైట్ పై 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.24,499 గా ఉంది.
అంటే లాంచ్ ధర రూ.30,999 నుంచి ఇప్పటివరకు రూ.6,550 తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 128జిబి స్టోరేజీ మోడల్ కొనాలనుకునే వారు రూ.24,499 కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
మరోవైపు, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ రూ.32,999 తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీని ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ.26,499 గా ఉంది.
Samsung Galaxy A34 సిల్వర్, బ్లాక్, లైట్ గ్రీన్ మరియు లైట్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A34 స్పెసిఫికేషన్స్
శాంసంగ్ గెలాక్సీ ఏ34 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడారు. ఇంకా ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
Samsung Galaxy A34 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని ఈ ఫోన్ లో అందించారు. ఇందులో 48ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13 ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Samsung Galaxy A34 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. ఇంకా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Samsung Galaxy A34 ని కొనవచ్చా?
రూ.25,000 లోపు ధరలో ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ లభిస్తుండటం మంచి విషయం. ఇంకా ఈ ఫోన్ లో సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 48ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి ఇది వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.











