
రీసెంట్ గా శాంసంగ్ సంస్థ గ్లోబల్ గా Samsung Galaxy S23 ఫ్లాగ్షిప్ సిరీస్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్లు Galaxy A34 5G, Galaxy A54 లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 91mobiles Hindi సౌజన్యంతో ఒక లీక్ కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. లీక్ ప్రకారం, Galaxy A34 5G, Galaxy A54 5G స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫస్ట్ లుక్ బయటకు వచ్చాయి.
Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
Samsung Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Samsung Galaxy A54 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్ (లీక్డ్)
Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 161 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 8 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.
Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Samsung Galaxy A34 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











