లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A34 ఇమేజెస్

హైలైట్స్

  • త్వరలో Galaxy A34 ని లాంచ్ చేయనున్న Samsung కంపెనీ
  • లాంచ్ కి ముందు నెట్టింట్లో ప్రత్యక్షమైన Samsung Galaxy A34 ఇమేజెస్
  • ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న Samsung Galaxy A34
Image Courtesy: @OnLeaks

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఏ-సిరీస్ లో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ ఫోన్ పేరు Samsung Galaxy A34. ఈ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. ఈలోపు ఈ ఫోన్ కి సంబంధించిన రెండర్ ఇమేజ్ మరియు వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అలాగే లేటెస్ట్ లీక్ ద్వారా Samsung Galaxy A34 యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఓసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A34 స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Image Courtesy: @OnLeaks

Samsung Galaxy A34 స్మార్ట్ ఫోన్ యు షేప్డ్ నాచ్ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఫ్లాట్ స్క్రీన్, కర్వ్డ్ ఎడ్జెస్ తో డిస్ప్లే యూనిట్ కనిపిస్తోంది. Samsung Galaxy A34 డిస్ప్లే మూడు వైపులా బెజెల్స్ ఉన్నాయి. బాటమ్ లో మందపాటి చిన్ ఉంది. లీక్ ప్రకారం, Samsung Galaxy A34 డివైజ్ 161.3 మిల్లీ మీటర్ల పొడవు, 77.7 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది. ఇక ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ డిస్ప్లే ఉండనుంది.

Samsung Galaxy A34 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని పిక్స్ ద్వారా స్పష్టమవుతోంది. బ్యాక్ ప్యానెల్ పై వర్టికల్ షేప్ లో కెమెరా మాడ్యూల్ ఉంది. అలాగే పక్కన ఫ్లాష్ లైట్ ఉంది. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్ సీ పోర్ట్ అందించారు. బాటమ్ లో యూఎస్బీ టైప్ సీ పోర్ట్ తో పాటు స్పీకర్ గ్రిల్ ఉంది. లీక్ సమాచారం నిజమేననుకుంటే, ఈ ఫోన్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్ తో రానుంది. Samsung Galaxy A34 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు Samsung Galaxy A33 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Samsung Galaxy A33 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A33 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్ కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16 మిలియన్ కలర్ డెప్త్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ రేటింగ్ Samsung Galaxy A33 5G లో ఉన్నాయి.

Samsung Galaxy A33 5G డివైజ్ కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఫోన్ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

Samsung Galaxy A33 ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ అందించారు. ఇది 2.4 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 8జిబి వరకు వర్చువల్ ర్యామ్ ని పొందే వీలుంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleయాప్ & వెబ్‌సైట్ ద్వారా Jio 5G Welcome Offer ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
Next articleBlack Friday Sale: Samsung Galaxy Z Flip 3 పై రూ.36,000 డిస్కౌంట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.