ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో రెండు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. Galaxy A35 5G, Galaxy A55 5G అనే పేర్లతో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ రెండు డివైజెస్ భారత్ కి చెందిన బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై లిస్ట్ అయ్యాయి. దీంతో త్వరలోనే ఈ ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నాయని స్పష్టమైంది. అంతేకాదు, Galaxy A35 5G డివైజ్ శాంసంగ్ యూఏఈ సపోర్ట్ పేజీపై లిస్ట్ అయ్యింది.
Samsung Galaxy A35 5G, A55 5G బీఐఎస్ మరియు సపోర్ట్ పేజెస్
- Samsung Galaxy A35 5G బీఐఎస్ లిస్టింగ్ లో SM-A356E/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- Samsung Galaxy A55 5G బీఐఎస్ లిస్టింగ్ లో SM-A556E/DS మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- ఇంకా శాంసంగ్ యూఏఈ సపోర్ట్ పేజీలో Galaxy A35 5G లిస్ట్ అయ్యింది.
- ఈ రెండు ప్లాట్ఫామ్స్ పై లిస్ట్ కావడంతో త్వరలోనే డివైజెస్ మార్కెట్ లోకి లాంచ్ కానున్నాయని అర్థమవుతోంది.
- బీఐఎస్ సర్టిఫికేషన్, యూఏఈ సపోర్ట్ పేజీ ద్వారా డివైజెస్ కి సంబంధించిన ఏ స్పెసిఫికేషన్స్ కూడా రివీల్ కాలేదు.
Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్బెంచ్ వెబ్సైట్ ద్వారా తెలిసింది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో గీక్బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
- కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A35 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.
- ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
