Home News Samsung Galaxy A35 5G ధర వివరాలు తెలుసుకోండి

Samsung Galaxy A35 5G ధర వివరాలు తెలుసుకోండి

Highlights
  • ఇటీవలే లాంచైన Samsung Galaxy A35 5G
  • Samsung Galaxy A35 5G ధర వెల్లడి
  • డివైజ్ ప్రారంభ ధర రూ.30,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె Galaxy A35 5G ని లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ ధరను రివీల్ చేసింది. Samsung Galaxy A35 5G డివైజ్ ప్రీమియమ్ గ్లాస్ ప్యానెల్ తో రావడంతో లుక్ ఏంతో రిచ్ గా ఉంది. రూ.30 వేల లోపు ఈ ఫోన్ ధరను పెట్టారు. ఓసారి శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A35 5G ధర

Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A35 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.30,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.

Samsung Galaxy A35 5G డివైజ్ ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ నేవీ మరియు ఆసమ్ లైలాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్