Samsung: FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై లిస్టైన Samsung Galaxy A35 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A35 5G
  • ఎఫ్‌సీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన డివైజ్
  • ఎగ్జినోజ్ 1380 చిప్సెట్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy A35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. గతేడాది మార్చి నెలలో వచ్చిన Samsung Galaxy A34 5G కి సక్సెసర్ గా Samsung Galaxy A35 5G డివైజ్ రానుంది. ఇటీవలె Samsung Galaxy A35 5G డివైజ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్ పై కనిపించింది. తాజాగా యూఎస్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy A35 5G ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్

 

  • Samsung Galaxy A35 5G డివైజ్ లాంచ్ కి ముందు FCC వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. 91మొబైల్స్ ఈ విషయాన్ని గుర్తించింది.
  • SM-A356U మరియు SM-A356E అనే మోడల్ నంబర్లతో Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
  • ఎఫ్‌సీసీ లిస్టింగ్ పై Samsung Galaxy A35 5G ఫోన్ 5జీ కనెక్టివిటీ, ఎన్ఎఫ్‌సీ, ఎస్డీ కార్డ్ స్లాట్ వంటి స్పెసిఫికేషన్స్ తో లిస్ట్ అయ్యింది.
  • లిస్ట్ లో EP-TA800 చార్జర్ పేర్కొనబడి ఉంది. దీన్ని బట్టి, గెలాక్సీ ఏ35 డివైజ్ 25 వాట్ చార్జర్ తో వచ్చే అవకాశముందని అర్థమవుతోంది.
  • గీక్‌బెంచ్ లిస్టింగ్ పై గెలాక్సీ ఏ35 ఫోన్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14, వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో కనిపించింది.

Samsung Galaxy A35 5G డిజైన్

  • రెండర్స్ ప్రకారం, Samsung Galaxy A35 5G ఫోన్ డిజైన్ చూడటానికి Galaxy S23 FE లాగా కనిపిస్తోంది.
  • Samsung Galaxy A35 5G డివైజ్ ఫ్లాట్ ఎడ్జెస్, పంచ్-హోల్ డిస్ప్లే, యూఎస్బీ-సీ పోర్ట్ ని కలిగి ఉంది.
  • Samsung Galaxy A35 5G డివైజ్ లో వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
  • Samsung Galaxy A35 5G లీకైన రెండర్స్ ని చూస్తే, బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని గమనించవచ్చు. సెన్సర్స్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
  • Samsung Galaxy A35 5G స్క్రీన్ సైజ్ 6.6 ఇంచెస్ ఉన్నట్లు అర్థమవుతోంది. డివైజ్ తెలుపు రంగులో కనిపిస్తోంది. కానీ, వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
  • Samsung Galaxy A35 5G తో పాటు Galaxy A55 పై కూడా శాంసంగ్ పని చేస్తున్నట్లు సమాచారం.
  • Samsung Galaxy A35 5G ఫోన్ ధర రూ.30,000 కు అటు-ఇటుగా ఉండే చాన్స్ ఉంది. మరోవైపు, Galaxy A55 డివైజ్ ధర ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా వేయవచ్చు.
  • రానున్న రోజుల్లో Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలియనున్నాయి.
Previous articleVivo: త్వరలో లాంచ్ కానున్న Vivo Y100 5G కొత్త వేరియంట్
Next articleRedmi: 24GB LPDDR5T ర్యామ్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో రానున్న Redmi K70 Ultra
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.