ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A35 డివైజ్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్స్టర్ OnLeaks ద్వారా ఫోన్ వివరాలు బయటకు వచ్చాయి. రిపోర్ట్ ప్రకారం, Samsung Galaxy A35 డివైజ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6జిబి/8జిబి ర్యామ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. సరే, ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A35 స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: లీక్స్టర్ ప్రకారం, Samsung Galaxy A35 డివైజ్ లో 6.6-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- కెమెరా: Samsung Galaxy A35 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A35 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Samsung Galaxy A35 డివైజ్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తుంది.
Samsung Galaxy A35 ధర, కలర్ ఆప్షన్స్
- Samsung Galaxy A35 స్మార్ట్ఫోన్ 6జిబి ర్యామ్ వేరియంట్ ధర 389 యూరోలు (సుమారు రూ.35,000) గా ఉంటుంది.
- Samsung Galaxy A35 డివైజ్ 8జిబి ర్యామ్ మోడల్ ధర 459 యూరోలు (సుమారు రూ.41,300) గా ఉంటుందని అంచనా.
- Samsung Galaxy A35 డివైజ్ ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ లెమన్, ఆసమ్ లైలాక్ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Samsung Galaxy A35 స్మార్ట్ఫోన్ మార్చి నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ తో పాటు మరొక మోడల్ Samsung Galaxy A55 కూడా లాంచ్ అవుతోంది.
