మార్చి 15 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G

Highlights

  • త్వరలో రెండు మిడ్-రేంజ్ ఫోన్లను లాంచ్ చేయబోతున్న శాంసంగ్ సంస్థ
  • లాంచ్ కి ముందు లాంచ్ తేదీని రివీల్ చేసిన ప్రముఖ టిప్‌స్టర్
  • మార్చి 15 న గ్లోబల్ గా లాంచ్ కానున్న Galaxy A54 5G, Galaxy A34 5G

ఇటీవలె Galaxy S23 సిరీస్ ని లాంచ్ చేసిన Samsung సంస్థ ఇప్పుడు మిడ్-రేంజ్ ఫోన్ల లాంచ్ పై దృష్టి పెట్టింది. త్వరలోనే శాంసంగ్ నుంచి Galaxy A54 5G మరియు Galaxy A34 5G ఫోన్లు రానున్నాయి. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్స్ వెబ్ సైట్స్ పై కనిపించాయి. దీంతో వీటి లాంచ్ దగ్గర్లోనే ఉందని స్పష్టమైంది. శాంసంగ్ అయితే A54 5G డివైజ్ ని తన అధికార వెబ్ సైట్ లో పెట్టేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 8.4 రిపెయిరబులిటీ స్కోర్ ని సాధించింది. ఇది Galaxy S23 Ultra కంటే ఎక్కువ.

ఇక Galaxy A54 5G, Galaxy A34 5G లాంచ్ తేదీ తాజాగా రివీల్ అయ్యింది. నమ్మదగిన టిప్‌స్టర్ OnLeaks ఈ ఏ-సిరీస్ డివైజెస్ లాంచ్ తేదీని రివీల్ చేశారు. సరే, పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

రివీలైన Samsung Galaxy A54 5G, Galaxy A34 5G లాంచ్ తేదీ

2023 మార్చి 15 న Samsung Galaxy A54 5G, Galaxy A34 5G స్మార్ట్ ఫోన్స్ గ్లోబల్ గా లాంచ్ కానున్నాయని టిప్‌స్టర్ ఓ ట్వీట్ చేశారు. అయితే భారత్ లో కూడా అదే రోజున లాంచ్ అవుతాయా? లేదా అనే విషయాన్ని శాంసంగ్ ప్రకటించాల్సి ఉంది. మరోవైపు శాంసంగ్ సంస్థ Galaxy S23 FE ని తీసుకొచ్చేందుకు Galaxy A74 5G ని నిలిపివేసింది.

Samsung Galaxy A54 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A54 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.

Samsung Galaxy A54 లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 161 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 8 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy A34 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.

Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.