ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె తన ఫ్లాగ్షిప్ సిరీస్ Galaxy S23 ని లాంచ్ చేసింది. ఇప్పుడు Galaxy A-సిరీస్ లో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఓ లీక్ Samsung Galaxy A54, Galaxy A34 డివైజెస్ యొక్క ఇండియా లాంచ్ టైమ్ లైన్ ని తెలియజేస్తోంది.
టిప్‌స్టర్ Debayan Roy ప్రకారం, Samsung Galaxy A54, Galaxy A34 ఫోన్లు భారత్ లో మార్చి చివర్లో లాంచ్ అవుతాయని తెలుస్తోంది. గ్లోబల్ లాంచ్ తర్వాత కొన్ని రోజులకు భారత్ లో Samsung డివైజెస్ లాంచ్ కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగనుందని తాజా లీక్ ద్వారా స్పష్టమవుతోంది. సరే, ఓసారి Samsung Galaxy A54, Galaxy A34 ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఇవి లీకైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇస్తోన్న వివరాలు.
Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుందని అంచనా. ఈ డిస్ప్లే 2340*1080 పిక్సెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో ఈ ఫోన్ వస్తోందని సమాచారం. ఇతర ర్యామ్, స్టోరేజీ ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది.
Samsung Galaxy A54 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
కెమెరా విభాగం విషయానికి వస్తే, ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Samsung Galaxy A34 5G స్పెసిఫికేషన్స్
Samsung Galaxy A34 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ తో ఈ ఫోన్ రానుంది. Samsung Galaxy A34 5G డివైజ్ 161 మిల్లీ మీటర్ల పొడవు, 78 మిల్లీ మీటర్ల వెడల్పు, 8 మిల్లీ మీటర్ల మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.
Samsung Galaxy A34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Samsung Galaxy A34 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఐపీ67 రేటింగ్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, ఓటీజీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
