Home News 50ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A54 5G

50ఎంపి కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన Samsung Galaxy A54 5G

Highlights
  • Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని భారత్ లో లాంచ్ చేసిన కంపెనీ
  • ఏ-సిరీస్ లో వచ్చిన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్స్ Samsung Galaxy A34 5G, A54 5G
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చిన లాంచైన Samsung Galaxy A54 5G

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు నేడు భారత మార్కెట్ లో Samsung Galaxy A34 5G, A54 5G డివైజెస్ ని లాంచ్ చేసింది. ఏ-సిరీస్ లో వచ్చిన కొత్త ఫోన్లు ఇవే. మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి మెయిన్ కెమెరాతో Samsung Galaxy A54 5G లాంచైంది.

భారత్ లో Samsung Galaxy A34 5G, A54 5G స్మార్ట్ ఫోన్స్ ధరలు, సేల్ తేదీ, లభ్యత తదితర వివరాలు వెల్లడి కానున్నాయి. సరే, ఓసారి Samsung Galaxy A54 5G ఇండియా లాంచ్ విశేషాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy A54 5G ధర, కలర్ ఆప్షన్స్

భారత్ లో Samsung Galaxy A54 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8జిబి+128జిబి యూనిట్ ధర రూ.38,999 గా ఉంది. రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. ఇది వద్దనుకుంటే, రూ.2500 శాంసంగ్ అప్‌గ్రేడ్ బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఫోన్ ఆసమ్ లైమ్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి+256జిబి వేరియంట్ ధరను రూ.40,999 గా నిర్ణయించారు. పైన చెప్పబడిన ఆఫర్లు దీనికి కూడా వర్తిస్తాయి.

Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A54 5G డివైజ్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉంటాయి. మెమొరీని మైక్రెఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.