Home News Samsung అధికార వెబ్‌సైట్ లో కనిపించిన Galaxy A54 5G

Samsung అధికార వెబ్‌సైట్ లో కనిపించిన Galaxy A54 5G

Highlights
  • శాంసంగ్ అఫీషియల్ వెబ్‌సైట్ పై కనిపించిన Samsung Galaxy A54 5G
  • గతంలో ఎన్నో సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయిన Samsung Galaxy A54 5G
  • కంపెనీ అధికార వెబ్‌సైట్ ద్వారా రివీల్ అయిన Samsung Galaxy A54 5G యొక్క రిపెయిరబులిటీ స్కోర్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రానున్న కొన్ని వారాల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. రీసెంట్ గా ఈ డివైజ్ TENAA సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో ఫోన్ స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. 2022 డిసెంబర్ లో తొలిసారిగా Bluetooth SIG సర్టిఫికేషన్ Samsung Galaxy A54 5G లాంచ్ ని కన్ఫర్మ్ చేసింది.

రీసెంట్ గా NBTC సర్టిఫికేషన్ ని Samsung Galaxy A54 5G క్లియర్ చేసింది. తర్వాత FCC పై లిస్ట్ అయ్యింది. రీసెంట్ గా Samsung Galaxy A54 5G డివైజ్ యూరోపియన్ మార్కెట్ ధర, కలర్ ఆప్షన్స్, డివైజ్ రెండర్స్ లీకైయ్యాయి. ఎట్టకేలకు Samsung Galaxy A54 5G డివైజ్ శాంసంగ్ అధికార వెబ్ సైట్ లో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫోన్ యొక్క రిపేరబులిటీ స్కోర్ ఎంతో తెలిసింది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఈ విషయాన్ని గుర్తించారు.

Samsung అధికార వెబ్‌సైట్ లో కనిపించిన Samsung Galaxy A54

ఇమేజెస్ ని బట్టి, Samsung Galaxy A54 డివైజ్ SM-A546B అనే మోడల్ నంబర్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 8.4 రిపెయిరబులిటీ స్కోర్ ని నమోదు చేసినట్లు అర్థమవుతోంది. రీసెంట్ గా లాంచైన శాంసంగ్ ఫ్లాగ్షిప్ డివైజ్ Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్ కంటే ఇది ఉత్తమమైన స్కోర్. ఎందుకంటే, Samsung Galaxy A54 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.

ఇకపోతే Samsung Galaxy S23 Ultra కాంప్లెక్స్ బాడీతో కూడి ఎన్నో సెన్సర్స్ ని కలిగి ఉంటుంది. Samsung Galaxy A54 డివైజ్ శాంసంగ్ యొక్క యూరోపియన్ సపోర్ట్ పేజీలో ప్రత్యక్షమైంది. గతంలో ఈ ఫోన్ ధర 590 యూరోలు (సుమారు రూ.52,200) గా ఉంటుందని తెలిసింది. ఇది 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఇక 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ మోడల్ ధర 610 యూరోలు (సుమారు రూ.54,000) గా ఉంది.

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ ఆసమ్ వైట్, ఆసమ్ గ్రాఫైట్, ఆసమ్ లైమ్, ఆసమ్ వయొలెట్ అనే 4 కలర్ ఆప్షన్స్ లో లభించనుందని సమాచారం. ఈ ఫోన్ ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కూడా లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ భారత మార్కెట్ లో లాంచ్ అవ్వడం ఖరారైంది.

గతంలో వచ్చిన ఎన్నో లీక్స్ ద్వారా Samsung Galaxy A54 డివైజ్ 6.4-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 చిప్సెట్ తో రానుందని తెలిసింది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. కెమెరా విభాగం విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32 ఎంపి కెమెరా ఉంటుంది.

Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ67 రేటింగ్ తో వస్తోంది. ఇంకా వై-ఫై 6 కనెక్టివిటీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.