
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శాంసంగ్ సంస్థ జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. చైనా బ్రాండ్స్ ఆదిపత్యం ఉన్నప్పుడు, లేనప్పుడు.. అది ఏ సమయమైనా సరే, శాంసంగ్ కి ఉన్న బ్రాండ్ విలువ పడిపోలేదు. జనాల్లో శాంసంగ్ పట్ల ఆదరణ తగ్గలేదు. మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్, లో-ఎండ్ సెగ్మెంట్స్ లో రకరకాల ఫోన్లను సమయానుగుణంగా లాంచ్ చేస్తూ, శాంసంగ్ సంస్థ ఇతర కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది.
మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఈ సంస్థ నుంచి రీసెంట్ గా Samsung Galaxy A54 5G, Samsung Galaxy F54 5G ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్లకు యూజర్లలో చక్కటి ఆదరణ లభిస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా శాంసంగ్ సొంత చిప్సెట్స్ Exynos 1380 తో లాంచ్ అయ్యాయి.
ఈ ఆర్టికల్ లో రెండు ఫోన్లను పోల్చి, ఏది ఉత్తమమైనదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Samsung Galaxy A54 5G vs Samsung Galaxy F54 5G
- డిస్ప్లే: Samsung Galaxy A54 5G లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 403 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ కలిగి ఉంది. మరోవైపు Samsung Galaxy F54 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి. పెద్ద డిస్ప్లే కావాలనుకునే వారికి Galaxy F54 5G ఉత్తమమైన ఎంపికని చెప్పవచ్చు. అయితే A54 5G లో పిక్సెల్ డెన్సిటీ ఎక్కువగా ఉండటం వల్లన పిక్చర్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. రెండు ఫోన్లు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చాయి.
- చిప్సెట్: Samsung Galaxy A54 5G మరియు Samsung Galaxy F54 5G ఫోన్లలో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ నే వాడారు. రెండు ఫోన్లు 8జిబి ర్యామ్ తో వస్తున్నాయి. పెర్ఫామెన్స్ విషయంలో రెండు ఫోన్లు ఒకే విధమైన ఔట్పుట్ ని ఇవ్వనున్నాయి.
- కెమెరా విభాగం: Samsung Galaxy A54 5G లో 50ఎంపి + 12ఎంపి + 5ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మరోవైపు Samsung Galaxy F54 5G లో 108ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా విషయానికి వస్తే, F54 లో పెద్ద సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తుండటంతో ప్రాక్టికల్ గా దీని పెర్ఫామెన్స్ బాగుంటుందని అంచనా వేయవచ్చు. ఇక A54 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా పెర్ఫామెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఇందులో 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. అదే F54 లో 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఇక్కడ దేని ప్రత్యేకత దానిదే అన్నట్లు ఉంది.
- భారీ ప్రధాన కెమెరా కావాలనుకుంటే Galaxy F54 5G ని ఎంచుకోవడం ఉత్తమం. అన్నీ బ్యాలన్స్డ్ గా ఉండాలని భావిస్తే, Galaxy A54 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
- ఫ్రంట్ కెమెరా: రెండు ఫోన్లలో కూడా 32ఎంపి ఫ్రంట్ కెమెరాని అందించారు. కాబట్టి ఇక్కడ పెద్దగా తేడాలు ఏమీ గమనించలేం.
- బ్యాటరీ: Galaxy A54 5G డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. మరోవైపు Galaxy F54 5G లో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటే F54 కి వెళ్ళడం బెటర్. కానీ, 6.7-ఇంచ్ డిస్ప్లే కావడం వల్లన బ్యాటరీ వినియోగం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఇక చార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే, రెండు ఫోన్లు కూడా 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉన్నాయి.
- స్టోరేజీ: Galaxy A54 డివైజ్ 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. మరోవైపు F54 5G డివైజ్ 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభ్యమవుతుంది. రెండు ఫోన్లలో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
- ఓఎస్: Galaxy A54 మరియు Galaxy F54 డివైజెస్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.
- డైమెన్షన్స్: Galaxy A54 158.2 మి.మీ పొడవు, 76.7 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 202 గ్రాముల ఉంటుంది. మరోవైపు, Galaxy F54 164.9 మి.మీ పొడవు, 77.3 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 199 గ్రాముల ఉంటుంది.
- ఐపీ రేటింగ్: Galaxy A54 డివైజ్ ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వచ్చింది. మరోవైపు Galaxy F54 వాటర్ ప్రూఫ్ కాదు.
- Samsung Galaxy A54 5G డివైజ్ 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.38,999 గా ఉంది.
- Samsung Galaxy F54 5G డివైజ్ 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది.











