ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ Samsung త్వరలో కొత్త ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. Galaxy A55 5G, Galaxy A35 5G పేర్లతో వస్తోన్న ఈ డివైజెస్ లాంచ్ తేదీని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. మార్చి 11న ఈ ఫోన్లు భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతున్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ లాంచ్ తేదీ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Galaxy A55 5G, Galaxy A35 5G లాంచ్ తేదీ
- శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఏ55 5జీ మరియు గెలాక్సీ ఏ35 5జీ ఫోన్ల యొక్క టీజర్ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై ప్రజెంట్ చేసింది.
- ఫస్ట్ గ్లిమ్స్ ద్వారా ఫోన్ల యొక్క లుక్ అండ్ డిజైన్ రివీల్ అయ్యాయి.
- లాంచ్ టీజర్ లో ఫోన్ల లాంచ్ తేదీని పేర్కొనబడలేదు. కానీ, అధికార వెబ్సైట్ లో మార్చి 11 మధ్యాహ్నం 2.30 గంటలు అని కనిపిస్తోంది.
Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,650 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుంది. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,650 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy A55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
