ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G డివైజెస్ ని లాంచ్ చేయనుంది. తాజాగా Samsung Galaxy A55 5G సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై లిస్ట్ అయ్యింది. మరోవైపు పెరు దేశానికి చెందిన ఎంటీసీ టెలీకామ్ రిజిస్ట్రీ వెబ్‌సైట్ లో Samsung Galaxy A35 5G లిస్ట్ అయ్యింది. దీంతో ఈ రెండు ఫోన్లను శాంసంగ్ సంస్థ గ్లోబల్ గా లాంచ్ చేయనుందని అర్థమవుతోంది. సరే, ఓసారి సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A55 5G ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు
- Samsung Galaxy A55 5G డివైజ్ SM-A556E/DS అనే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
- Samsung Galaxy A55 5G డివైజ్ డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది.
- Samsung Galaxy A55 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
- Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఎక్స్క్లిప్స్ 530 జీపీయూ, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో రానున్నట్లు గీక్బెంచ్ ద్వారా రివీల్ అయ్యింది.
Samsung Galaxy A35 5G ఎంటీసీ లిస్టింగ్ వివరాలు
- Samsung Galaxy A35 5G డివైజ్ SM-A3565 మోడల్ నంబర్ తో ఎంటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.
- లీకైన రెండర్ ద్వారా Samsung Galaxy A35 5G బ్యాక్ ప్యానెల్ డిజైన్ రివీల్ అయ్యింది.
- Samsung Galaxy A35 5G బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Samsung Galaxy A35 5G డివైజ్ లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 6.6-ఇంచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, వన్‌యూఐ కస్టమ్ స్కిన్, 6జిబి ర్యామ్, 25 వాట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
ఇక గత మోడల్స్ Galaxy A34, A54 డివైజెస్ 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ తో వచ్చాయి.
గెలాక్సీ ఏ54 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్, గెలాక్సీ ఏ34 5జీ ఎగ్జినోస్ 1380 చిప్సెట్ తో వచ్చాయి. కెమెరా విభాగానికి వస్తే, ఏ54 లో 50ఎంపి + 12ఎంపి + 5ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
గెలాక్సీ ఏ34 5జీ లో 48ఎంపి + 8ఎంపి + 5ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
