Home News Samsung Galaxy A55 5G ధర వివరాలు తెలుసుకోండి

Samsung Galaxy A55 5G ధర వివరాలు తెలుసుకోండి

Highlights
  • Galaxy A55 5G ధర వెల్లడి
  • డివైజ్ ప్రారంభ ధర రూ.39,999
  • రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లు ఆకట్టుకునే డిజైన్‌ని కలిగి ఉన్నాయి. ఎగ్జినోస్ ప్రాసెసర్స్‌ని శాంసంగ్ ఈ ఫోన్లలో వాడింది. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A55 5G యొక్క ధర, ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A55 5G ధర, ఆఫర్లు

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy A55 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.39,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.42,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.45,999 గా ఉంది.

Samsung Galaxy A55 5G ఫోన్ కొనే హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ యూజర్లకు మరియు ఐడీఎఫ్‌సీ, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ఆసమ్ ఐస్‌బ్లూ మరియు ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా డివైజ్‌ని కొనుగోలు చేసే యూజర్లకు సిలికాన్ కేస్‌ని కంపెనీ అందిస్తోంది.

Samsung Galaxy A55 5G డివైజ్ ని మార్చి 14 నుంచి శాంసంగ్.ఇన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మార్చి 18 నుంచి ఇతర ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్‌కి వస్తుంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్