Samsung: ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై లిస్టైన Samsung Galaxy A55 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy A55 5G
  • ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై లిస్టైన డివైజ్
  • Galaxy A55 5G ధర రూ.40,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ఫిబ్రవరి ఆఖర్లో లేదా మార్చి ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే కచ్చితమైన తేదీని కంపెనీ వెల్లడించనుంది. తాజాగా Samsung Galaxy A55 5G డివైజ్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G ఎఫ్‌సీసీ లిస్టింగ్ (లీక్)

  • Samsung Galaxy A55 5G డివైజ్ ఎఫ్‌సీసీ డేటాబేస్ పై SM-A556E/DS అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. డీఎఎస్ అంటే డ్యూయల్ సిమ్ అని అర్థం.
  • Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ EP-TA800 మోడల్ అడాప్టర్ తో లిస్ట్ అయ్యింది. అంటే ఈ ఫోన్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు అర్థమవుతోంది.

Samsung Galaxy A55 5G ఇండియా లాంచ్ ధర (అంచనా)

  • శాంసంగ్ సంస్థ ఇంకా Samsung Galaxy A55 5G కి సంబంధించి అధికార ప్రకటన చేయలేదు.
  • Samsung Galaxy A55 5G డివైజ్ ఫిబ్రవరి ఆఖర్లో లేదా మార్చి ఆరంభంలో లాంచ్ అవుతుందని మేం అంచనా వేస్తున్నాం.
  • Samsung Galaxy A55 5G ధర రూ.40,000 లోపు ఉంటుందని అంచనా వేయవచ్చు.
  • అయితే Samsung Galaxy A55 5G లాంచ్ తేదీ, ధర అధికారికంగా వెల్లడవ్వాల్సి ఉంది.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy A55 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 ఆక్టా-కోర్ చిప్సెట్ ఉంటుంది.
  • ఓఎస్: Samsung Galaxy A55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.
  • కెమెరా: Samsung Galaxy A55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Previous articleiQOO Neo 9 Pro డిస్ప్లే స్పెసిఫికేషన్స్ ఖరారు
Next articleInfinix: 8జిబి ర్యామ్, 50ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన Infinix Smart 8
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.