
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు భారత్ లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ ఫోన్ల లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ రెండు ఫోన్లలో టాప్ మోడల్ అయిన Galaxy A55 5G లో ఉన్న టాప్ 5 ఫీచర్స్ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఎగ్జినోస్ ప్రాసెసర్, 12జిబి ర్యామ్ తో వచ్చింది. సరే, ఓసారి ఈ ఫోన్ ఆఫర్ చేస్తోన్న ఉత్తమమైన ఫీచర్లేంటో తెలుసుకుందాం.
Samsung Galaxy A55 5G లో ఉన్న టాప్ 5 ఫీచర్లు
- డిస్ప్లే: Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ లో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అందించారు. అలాగే విజన్ బూస్టర్ ఫీచర్ తో కూడిన 120 హెర్ట్జ్ డిస్ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంది.
- కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. వీటిలో 50ఎంపి మెయిన్ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వచ్చింది. ఇది మెరుగైన ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రంట్ లో 32ఎంపి కెమెరా అందించారు.
- సెక్యూరిటీ: Samsung Galaxy A55 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. అలాగే ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వచ్చింది.
- ఓఎస్: Samsung Galaxy A55 5G డివైజ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ తో వచ్చింది. 4 ఏళ్ళ పాటు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ సొంతం.
- కనెక్టివిటీ: Samsung Galaxy A55 5G లో బ్లూటూత్ 5.3, వై-ఫై 6, 5జీ, యూఎస్‌బీ 2.0 వంటి ఆప్షన్స్ అందించారు.
Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (1080*2340 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.
ప్రాసెసర్: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఏఎండీ ఎక్స్‌క్లిప్స్ 530 జీపీయూ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఫోన్‌కి లభిస్తాయి.
కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Samsung Galaxy A55 5G లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
సెక్యూరిటీ: Samsung Galaxy A55 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.
ఇతర ఫీచర్లు: శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, యూఎస్‌బీ 2.0 ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A55 5G డివైజ్ ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.