Home News Samsung Galaxy A55, A35 5G ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్

Samsung Galaxy A55, A35 5G ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్

Highlights
  • గెలాక్సీ ఏ55, ఏ35 పై డిస్కౌంట్
  • రూ.6,000 వరకు తగ్గింపు
  • 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung మార్చి నెలలో Galaxy A55, Galaxy A35 ఫోన్లు లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్లు ఎక్స్‌చేంజ్ మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కలిపి రూ.6,000 వరకు డిస్కౌంట్ పై లభిస్తున్నాయి. గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లకు భారత్ లో మాంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా లభిస్తోన్న ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే తక్కువ ధరకే ఈ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy A55, Galaxy A35 ఆఫర్ వివరాలు

భారత్ లో Samsung Galaxy A55 రూ.39,999 ధరతో లాంచ్ అయ్యింది. Samsung Galaxy A35 రూ.30,999 ధరతో లాంచ్ అయ్యింది.

ఆఫర్ లో భాగంగా Samsung Galaxy A55 రూ.33,999 కే లభిస్తోంది. మరోవైపు, Samsung Galaxy A35 రూ.25,999 కే లభిస్తోంది.

ఆఫర్ లో Samsung Galaxy A55 పై రూ.6,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ అందుబాటులో ుంది. Samsung Galaxy A35 పై రూ.5,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.

ఈ ఆఫర్ హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ మరియు వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్స్ పై చెల్లుబాటు అవుతుంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ తో పాటు, 6 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. ఆఫర్ ప్రయోజనం, ఏకమొత్తం చెల్లింపు మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కు కూడా వర్తిస్తుంది.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ క్రింద, కస్టమర్లకు గెలాక్సీ ఏ55 పై రూ.6,000 బోనస్, గెలాక్సీ ఏ35 పై రూ.5,000 బోనస్ లభిస్తుంది.

అయితే, గమనించాల్సి విషయం ఏంటంటే.. మీరు క్యాష్‌బ్యాక్ లేదా ఎక్స్‌చేంజ్ ఆఫర్లలో ఏదేని ఒకదాన్ని మాత్రమే పొందగలరు.

Samsung Galaxy A55 మరియు Samsung Galaxy A35 ఫోన్లను ఆఫర్ పై సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనుగోలు చేయవచ్చు. కంపెనీ వెబ్‌సైట్ పై కూడా ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే హెచ్డీఎఫ్‌సీ మరియు ఎస్బీఐ బ్యాంక్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడారు. 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది.

50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఇంకా ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ, వై-ఫై 6, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 1టిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ, 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా, 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy A35 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5జీ, వై-ఫై 6 ఉన్నాయి.

Source