ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy A55 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కోసం గెలాక్సీ ఏ-సిరీస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఫోన్ కి సంబంధించి కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. తాజాగా Samsung Galaxy A55 డివైజ్ బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A55 గీక్‌బెంచ్ లిస్టింగ్
- Samsung నుంచి రాబోవు కొత్త ఫోన్ Samsung Galaxy A55 గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- సింగిల్ కోర్ టెస్ట్ లో Samsung Galaxy A55 డివైజ్ 1180 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3536 పాయింట్లు నమోదు చేసింది.
- Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
- Samsung Galaxy A55 లో గ్రాఫిక్స్ కోసం Xclipse 530 GPU ని ఎక్విప్ చేసినట్లు తెలుస్తోంది.
Samsung Galaxy A55 డిజైన్ (లీక్)
- కొన్ని రోజుల క్రితం Samsung Galaxy A55 రెండర్స్ లీక్ అయ్యాయి.
- ఇమేజ్ ని గమనిస్తే, డివైజ్ ముందు భాగంలో పంచ్-హోల్ డిస్ప్లే ఉంది.
- బ్యాక్ ప్యానెల్ గ్లాస్ ఫినిషింగ్ తో కనిపిస్తోంది. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
- సైడ్ ఫ్రేమ్ మెటీరియల్ మెటల్ అని తెలుస్తోంది. కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ఉన్నాయి.
- Samsung Galaxy A55 డివైజ్ బాటమ్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్ ఉన్నాయి.
Samsung Galaxy A55 స్పెసిఫికేషన్స్ (అంచనా)
- డిస్ప్లే: Samsung Galaxy A55 లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy A55 లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్ వాడినట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉంటాయి.
- కెమెరా: Samsung Galaxy A55 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Samsung Galaxy A55 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Samsung Galaxy A55 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy A55 లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ వంటి ఆప్షన్స్ ఉండవచ్చు.
