హైలైట్స్
- బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy F04 యొక్క లాంచ్ తేదీ ఖరారు
- 2023 జనవరి 4 న భారత్ లో లాంచ్ అవుతోన్న Samsung Galaxy F04
- మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వస్తోన్న Samsung Galaxy F04
- Samsung Galaxy F04 ధర రూ.8,000 లోపు ఉండే అవకాశం
ఎన్నో లీక్స్, రూమర్స్ తర్వాత, Samsung Galaxy F04 యొక్క లాంచ్ అఫీషియల్ గా ఖరారైంది. Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ ని 2023 జనవరి 4 న లాంచ్ చేయబోతున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. ఇతర గెలాక్సీ ఎఫ్-సిరీస్ డివైజెస్ మాదిరి Samsung Galaxy F04 స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ యూనిక్ డివైజ్ గా నిలవనుంది.
ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ల్యాండింగ్ పేజీ దర్శనమిస్తోంది. దీంతో మనకు Samsung Galaxy F04 యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయన్న దానిపై స్పష్టత వచ్చినట్లైంది. ఈ పేజీ ద్వారా ఫోన్ అంచనా ధర, 2 కలర్ ఆప్షన్స్ గురించి తెలిసింది. సరే ఓసారి ఆ వివరాలను చూద్దాం పదండి.
భారత్ లో Samsung Galaxy F04 ధర (అంచనా)
పైన ఇమేజ్ లో కనిపిస్తున్న విధంగా, Samsung Galaxy F04 భారత్ లో 2023 జనవరి 4 వ తేదీన ఫ్లిప్ కార్ట్ ద్వారా లాంచ్ అవుతోంది. ఈ డివైజ్ ధర రూ.7,XXX గా పేర్కొన్నారు. గత రిపోర్ట్స్ ని బట్టి, ఫోన్ ధర రూ.7,499 గా ఉండనుందని చెప్పవచ్చు. Samsung Galaxy F04 డివైజ్ 8జిబి ర్యామ్ (వర్చువల్ ర్యామ్ తో కలిపి) తో వస్తోందని సమాచారం. Samsung Galaxy F04 డివైజ్ జేడ్ పర్పుల్ మరియు ఓపల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Samsung Galaxy F04 స్పెసిఫికేషన్స్ (అంచనా)
Samsung Galaxy F04 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ ఉంటుంది. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది బేసిక్ చార్జింగ్ స్పీడ్ తో వస్తుంది.
ఇప్పుడు Samsung Galaxy F04 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ డివైజ్ లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. ఈ ఫోన్ లో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి. ఆసక్తిగల వారు ఓసారి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ యొక్క ల్యాండింగ్ పేజీని విజిట్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.