ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా భారతీయ మార్కెట్ లో గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy F05 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Samsung Galaxy F05 ధర, సేల్ వివరాలు
Samsung Galaxy F05 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.7,999 గా నిర్ణయించారు.
ఈ ఫోన్ ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా సెప్టెంబర్ 20 నుంచి ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy F05 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy F05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్ ఉంది. భారీ డిస్ప్లేను ఇష్టపడే వారికి ఇది బాగా సరిపోతుంది.
ప్రాసెసర్: Samsung Galaxy F05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఇచ్చారు. మల్టీ-టాస్కింగ్, యాప్ నేవిగేషన్ కి ఇది బాగా సరిపోతుంది.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F05 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ర్యామ్ ప్లస్ ఫీచర్ ద్వారా 8జిబి వరకు ర్యామ్ ను పెంచుకోవచ్చు. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని ఎక్స్‌ప్యాండ్ చేసుకునే వీలుంది.
కెమెరా: Samsung Galaxy F05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy F05 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy F05 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. రెండేళ్ళు ఓఎస్ అప్‌గ్రేడ్స్ మరియు 4 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.
కనెక్టివిటీ: Samsung Galaxy F05 లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy F05 లో భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
