ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎఫ్, ఎమ్ సిరీస్‌ల్లో కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, Galaxy F05, Galaxy M05, Galaxy M55s స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా ఈ మూడు ఫోన్లు వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ పొందాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy F05, M05, M55s వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వివరాలు
వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై SM-E055F అనే మోడల్ నంబర్ తో శాంసంగ్ ఫోన్ లిస్ట్ అయ్యింది. దీన్ని గెలాక్సీ ఎఫ్05 అని భావిస్తున్నారు.
లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై కనెక్టివిటీ కలిగి ఉన్నాయి.
మరో రెండు ఫోన్లు SM-M055F/DS, SM-M558B/DS అనే మోడల్ నంబర్లతో వై-ఫై అలయన్స్ ప్లాట్ఫామ్ పై లిస్ట్ అయ్యాయి. ఈ ఫోన్లు గెలాక్సీ ఎమ్05 మరియు గెలాక్సీ ఎమ్55ఎస్ అని సమాచారం.
రానున్న రోజుల్లో ఈ మూడు ఫోన్లకు సంబంధించిన మరింత సమాచారం రివీల్ అయ్యే అవకాశం ఉంది.
Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.
కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
