Samsung Galaxy F15 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • Samsung Galaxy F15 5G లాంచ్ తేదీ ప్రకటన
  • మార్చి 4న లాంచ్ అవుతోన్న డివైజ్
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా డివైజ్ సేల్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎఫ్-సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy F15 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. మార్చి 4న Samsung Galaxy F15 5G డివైజ్ భారత్ లో లాంచ్ అవుతోంది. మిడ్-బడ్జెట్ ఫోన్ గా వస్తోన్న ఈ డివైజ్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ అమోలెడ్ స్క్రీన్ వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. Samsung Galaxy F15 5G డివైజ్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది.

Samsung Galaxy F15 5G ఇండియా లాంచ్

  • Samsung Galaxy F15 5G డివైజ్ యొక్క ప్రొడక్ట్ పేజీని ఫ్లిప్‌కార్ట్ పై శాంసంగ్ అఫీషియల్ గా ప్రదర్శిస్తోంది.
  • Samsung Galaxy F15 5G డివైజ్ మార్చి 4న భారత్ లో లాంచ్ అవుతోందని మైక్రో-సైట్ ద్వారా తెలుస్తోంది.
  • Samsung Galaxy F15 5G ధర, సేల్ తేదీ మార్చి 4న మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించబడనుంది.
  • లాంచ్ తేదీ ప్రకటనతో పాటు, Samsung Galaxy F15 5G యొక్క ఫోటోలను మరియు ఎన్నో ముఖ్యమైన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ని కంపెనీ షేర్ చేసింది.

Samsung Galaxy F15 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy F15 5G లో సూపర్ అమోలెడ్ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. స్క్రీన్ సైజ్ ఇంకా తెలియదు. 6.5-ఇంచుల పైనే ఉండొచ్చు.
  • ప్రాసెసర్: Samsung Galaxy F15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
  • ఓఎస్: Samsung Galaxy F15 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ తో వస్తోంది. 4 ఏళ్లు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి. అంటే ఆండ్రాయిడ్ 14 తో లాంచై, ఆండ్రాయిడ్ 18 వరకు అప్‌గ్రేడ్ పొందుతుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy F15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.
  • కెమెరా: Samsung Galaxy F15 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్ లెన్స్, మ్యాక్రో కెమెరా ఉంటాయి. కెమెరా సెటప్ బ్యాక్ ప్యానెల్ పై నిలువుగా అమర్చబడి ఉంటుంది.
Previous articleTecno: ఫిబ్రవరి 27న భారత్‌లో లాంచ్ అవుతోన్న Spark 20C
Next articleXiaomi: చైనాలో లాంచైన Xiaomi 14 Ultra
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.