లాంచ్‌కి ముందు కంపెనీ వెబ్‌సైట్ లో లిస్టైన Samsung Galaxy F54 5G

Highlights

  • SM-E546B/DS అనే మోడల్ నంబర్ తో వెబ్ సైట్ పై కనిపించిన డివైజ్
  • Galaxy F54 5G డివైజ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తుందని అంచనా
  • భారత్ లో 5జీ సపోర్ట్ తో లాంచ్ కానున్న Samsung Galaxy F54 5G

త్వరలోనే శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఈ ఫోన్ గురించి అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా ఇవ్వలేదు. కానీ, కంపెనీ వెబ్ సైట్ లో Samsung Galaxy F54 5G డివైజ్ లిస్టై కనిపించింది. దీంతో అతి త్వరలో ఈ డివైజ్ భారత మార్కెట్ లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈమధ్యలో TheTechOutlook వెబ్ సైట్ భారత వెబ్ సైట్ తో పాటు, బంగ్లాదేశ్ శాంసంగ్ వెబ్ సైట్ లో కూడా ఈ డివైజ్ ని గుర్తించింది. దీన్ని బట్టి ఈ ఫోన్ వివిధ మార్కెట్స్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Samsung Galaxy F54 5G సర్టిఫికేషన్ వివరాలు

Samsung Galaxy F54 5G డివైజ్ SM-E546B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. మోడల్ నంబర్ కాకుండా ఇంకా ఫోన్ కి సంబంధించిన మరే ఇతర స్పెసిఫికేషన్స్ బయటకు రాలేదు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది.

Samsung Galaxy F54 5G బీఐఎస్ లిస్టింగ్ ని ఎక్స్‌క్లూజివ్ గా 91మొబైల్స్ గుర్తించింది. అయితే ఇప్పటి వరకు డివైజ్ మార్కెటింగ్ పేరు బయటకు రాలేదు. కానీ, ఎఫ్-సిరీస్ లో Samsung Galaxy F54 5G డివైజ్ రానుందని తెలుస్తోంది. ఈ డివైజ్ Galaxy F42 కి సక్సెసర్ గా వస్తోంది.

Samsung Galaxy F54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy F54 5G డివైజ్ Galaxy M54 5G డివైజ్ కి రీబ్రాండ్ వర్షన్ గా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి, స్పెసిఫికేషన్స్ కూడా దాదాపు అదే ఫోన్ ని పోలి ఉండేందుకు చాన్స్ ఉంది. సరే, ఓసారి Samsung Galaxy F54 5G అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.