Samsung Galaxy Z Flip 4, Z Fold 4 ధరలు; మొదలైన ప్రీ-ఆర్డర్

హైలైట్స్:

  • శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ధర రూ.89,999 నుంచి ప్రారంభం
  • శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ధర రూ.1,54,999
  • భారత్ లో ప్రీ-బుకింగ్స్ కి అందుబాటులోకి వచ్చిన ఫోల్డ్ 4, ఫ్లిప్ 4

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్స్ భారత మార్కెట్ ధరలను ఎట్టకేలకు శాంసంగ్ ప్రకటించింది. ఈ మడతబెట్టే ఫోన్లు శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ లో గత వారం లాంచ్ అయ్యాయి. ఆగస్టు 1 నుంచి ఈ ఫోన్లు భారత్ లో ప్రీ-రిజర్వేషన్ కు అందుబాటులో ఉన్నాయి. నేటి నుంచి, ఈ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసుకునే సౌలభ్యం ఉంది. రూ.89,999 నుంచి గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ధర మొదలు కానుంది. ఇక ఫోల్డ్ 4 ధర రూ.1,54,999 గా ఉంది. మిగతా వేరియంట్స్ ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy Z Flip 4, Z Fold 4 ధరలు, ప్రీ-బుకింగ్ వివరాలు

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 8జిబి+128జిబి వేరియంట్ ధర రూ.89,999 గా నిర్ణయించారు. ఇక 8జిబి+256జిబి వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది. బిస్పోక్ ఎడిషన్ ధర రూ.97,999 గా ఉంది. బిస్పోక్ ఎడిషన్ ద్వారా కస్టమర్ తనకు కావాల్సిన విధంగా ఫోన్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే కలర్ ఆప్షన్స్ ని ఇష్టానుసారం ఎంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలు పై రూ.5,199 విలువ గల వైర్లెస్ డువో చార్జర్ ని ఉచితంగా పొందవచ్చు. రూ.31,999 విలువ గల గెలాక్సీ వాచ్4 ని కేవలం రూ.2,999 కి పొందవచ్చు.

ఇక శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 యొక్క 12జిబి+256జిబి వేరియంట్ ధర రూ.1,54,999 గా ఉంది. 12జిబి+512జిబి వేరియంట్ ధర రూ.1,64,999 గా ఉంది. 12జిబి+1టీబీ యూనిట్ ధర రూ.1,84,999 గా ఉంది. 1టీబీ వేరియంట్ కేవలం శాంసంగ్.కామ్ పైనే కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 పై కూడా వైర్లెస్ డువో చార్జర్, గెలాక్సీ వాచ్4 ఆఫర్ అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 బోరా పర్పుల్, గ్రాఫైట్, పింక్ గోల్డ్ రంగుల ఆప్షన్స్ లో లభిస్తుంది. బిస్పోక్ ఎడిషన్ ద్వారా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ను కేవలం శాంసంగ్.కామ్ ద్వారా మీరు ఎంచుకోవచ్చు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 గ్రే గ్రీన్, ఫాంటమ్ బ్లాక్, బీజ్ రంగుల్లో లభిస్తుంది.

ఈ మడతబెట్టే ఫోన్ల ప్రీ-బుకింగ్ మొదలైంది. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ మరియు క్రెడిట్ కార్డ్ ఫుల్ పేమెంట్ ద్వారా ఫోన్ కొనుగోలు పై రూ.8,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy Z Flip 4, Z Fold 4 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, జెడ్ ఫోల్డ్ 4 ఫోన్లు తమ గత మోడల్స్ తో పోల్చితే స్వల్పంగా డిజైన్ మార్పులతో వస్తున్నాయి. అయితే ఓవరాల్ లుక్ మాత్రం అలాగే ఉంటుంది. ఫ్లిప్ 4 ఒక కాంపాక్ట్ ఫ్లిప్ ఫాక్టర్ తో వస్తుండగా, ఫోల్డ్ 4 బుక్ మాదిరి ఓపెన్ అయి భారీ డిస్ప్లేను రివీల్ చేస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లో 6.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. అలాగే 1.9 ఇంచ్ కవర్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఫోన్ మూసి ఉన్నప్పుడు నోటిఫికేషన్స్, సమయం, రంగు రంగుల వాల్ పేపర్స్ తదితర ఎన్నింటినో చూపించడానికి సరిగ్గా సరిపోతుంది.

గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 12ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 10ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 లో 6.2 అంగుళాల కవర్ స్క్రీన్, 7.6 అంగుళాల మెయిన్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్నాయి. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ అమర్చారు. ఇక ఈ ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజీని కలిగి ఉంది. ఫోల్డబుల్ ఫోన్స్ కి మాత్రమే ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 12ఎల్ ఓఎస్ పై ఈ ఫోన్ నడుస్తుంది.

ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ డివైజ్ లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీఎక్స్8 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ని కలిగి ఉంది.