హైలైట్స్
- భారత్ లో లాంచైన Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్
- 6.5-ఇంచ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 64/128జిబి స్టోరేజీ తో వచ్చిన Samsung Galaxy M04
- భారత్ లో Samsung Galaxy M04 ధర రూ.8,499
Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచైంది. ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ ని తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్ లో శాంసంగ్ ఫోన్ కోసం చూస్తున్నవారు ఈ ఫోన్ ని ప్రయత్నించవచ్చు. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సర్క్యులర్ రింగ్స్ లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఇచ్చారు. ఇంకా ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వన్ యూఐ 4.1 కోర్, 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటాయి. 1టిబి వరకు స్టోరేజీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.
Samsung Galaxy M04 మింట్ గ్రీన్, గోల్డ్, వైట్, బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.
భారత్ లో Samsung Galaxy M04 ధర, లభ్యత
Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ధర రూ.8,499 గా ఉంది. ఈ ఫోన్ డిసెంబర్ 16 నుంచి అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోంది. 4జిబి ర్యామ్+128జిబి వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy M04 స్పెసిఫికేషన్స్
Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో పీ35 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం IMG PowerVR GE8320 జీపీయూ వాడారు. ఈ ఫోన్ లో 4జిబి ర్యామ్ అందించారు. అయితే ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సాయంతో ర్యామ్ ని 4జిబి వరకు పెంచుకోవచ్చు. అంటే యూజర్ కి మొత్తం 8జిబి ర్యామ్ లభిస్తుంది. 64జిబి/128జిబి ఇంటర్నల్ మెమొరీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది. అలాగే మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో స్టోరేజీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
Samsung Galaxy M04 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Samsung Galaxy M04 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 4.1 కోర్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఇంకా శాంసంగ్ ఈ ఫోన్ కి రెండేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని హామీ ఇస్తోంది.
Samsung Galaxy M04 డివైజ్ 4జీ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ని కలిగి ఉంది. ఇందులో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Samsung Galaxy M04 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.