Home News బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Galaxy M04 ని లాంచ్ చేయనున్న Samsung

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Galaxy M04 ని లాంచ్ చేయనున్న Samsung

హైలైట్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో ఎంట్రీ లెవెల్ ఎమ్-సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుందని సమాచారం. Samsung Galaxy M04 అనే పేరుతో రానున్న ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. ఈ డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ పై కనిపించడంతో ఫోన్ కి సంబంధించిన కీలక విషయాలు తెలిశాయి. ఫోన్ ఫ్రంట్ డిజైన్, మెయిన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Google Play Console పై కనిపించిన Samsung Galaxy M04

పైన ఇమేజ్ లో కనిపిస్తోన్న విధంగా Samsung Galaxy M04 యొక్క ఫ్రంట్ లుక్ ఉంటుంది. బాటమ్ లో మందపాటి చిన్, వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే కనిపిస్తున్నాయి. బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇదేమీ ఆశ్చర్యం కాదు, ఈ కేటగిరీ ఫోన్లు ఇలాగే ఉండడం సహజం. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ ఫోన్ కి కుడివైపున ఉన్నట్లు తెలుస్తోంది.

Samsung Galaxy M04 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy M04 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Samsung Galaxy M04 లో 1660*720 పిక్సెల్స్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఇది 6.5-ఇంచ్ సైజు గల టీఎఫ్‌టీ ప్యానెల్ అని భావిస్తున్నారు. ఇక ఈ డివైజ్ 3జిబి ర్యామ్ తో రానుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్ ఉంటుంది. Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా వివరాలు ఇంకా ఖరారు కాలేదు. అయితే అంచనా ప్రకారం, Samsung Galaxy M04 లో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, దీనికి తోడు 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇక పవర్ బ్యాకప్ విషయానికి వస్తే, Samsung Galaxy M04 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy M04 లో బ్లూటూత్, వై-ఫై వంటి అన్ని బేసిక్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి. ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయి. అప్పుడు పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.