ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో ఎమ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Samsung Galaxy M05 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జిబి ర్యామ్ వంటి ఫీచర్లు అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Samsung Galaxy M05 ధర, లభ్యత
Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.7,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ మింట్ గ్రీన్ కలర్ లో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి వస్తోంది. అలాగే శాంసంగ్.కామ్ మరియు ఎంపిక చేయబడిన రిటైల్ స్టోర్స్ లో కూడా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy M05 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy M05 లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:0 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
చిప్సెట్: Samsung Galaxy M05 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ వాడారు. ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా ఇదే చిప్సెట్ వాడతారు. పెర్ఫామెన్స్ కూడా స్మూథ్ గా ఉంటుంది.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M05 డివైజ్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 8జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
కెమెరా: Samsung Galaxy M05 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M05 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Samsung Galaxy M05 లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy M05 లో భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు.
