Home News Samsung Galaxy M05: త్వరలో గెలాక్సీ ఎమ్05 లాంచ్, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన సపోర్ట్ పేజీ

Samsung Galaxy M05: త్వరలో గెలాక్సీ ఎమ్05 లాంచ్, కంపెనీ వెబ్‌సైట్‌పై లిస్టైన సపోర్ట్ పేజీ

Highlights
  • త్వరలో Samsung Galaxy M05 విడుదల
  • ఇంకా వెల్లడి కానీ లాంచ్ తేదీ వివరాలు
  • ఇప్పటికే బీఐఎస్ పై లిస్టైన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఎమ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M05 పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ, శాంసంగ్ అధికార వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. అయితే స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

Samsung Galaxy M05 ఇండియా సపోర్ట్ పేజీ

Samsung Galaxy M05 సపోర్ట్ పేజీ ద్వారా మోడల్ నంబర్ రివీల్ అయ్యింది. ఈ ఫోన్ SM-M055F/DS అనే మోడల్ నంబర్‌ను కలిగి ఉంది. అయితే, స్పెసిఫికేషన్స్ ఏమీ బయటకు రాలేదు. కానీ, త్వరలోనే అఫీషియల్ లాంచ్ ఉంటుందని ఈ సపోర్ట్ పేజీతో అర్థమవుతోంది. గెలాక్సీ ఎమ్04 కి సక్సెసర్ గా Samsung Galaxy M05 ఎంట్రీ ఇవ్వబోతోంది.

Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై లిస్ట్ అయ్యింది. ఇంకా వై-ఫై అలయన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది.

బీఐఎస్ ద్వారా డ్యూయల్ సిమ్ సపోర్ట్ కన్ఫర్మ్ అయ్యింది. వై-ఫై అలయన్స్ ద్వారా 2.4 గిగాహెర్ట్జ్ మరియు 5 గిగాహెర్ట్జ్ వై-ఫై సపోర్ట్ ఫీచర్స్ రివీల్ అయ్యాయి. రెండు లిస్టింగ్స్ ద్వారా తెలిసిన సమాచారం ఇంతే. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Samsung Galaxy M05 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. శాంసంగ్ నుంచి త్వరలో లాంచ్ మరియు స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన అధికార ప్రకటన రావొచ్చు.