
ప్రముఖ టెక్ బ్రాండ్ Samsung త్వరలో Galaxy M14 4G, Galaxy F14 4G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్లు తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ ఫోన్లకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ప్రకటన రావచ్చు. తాజాగా సపోర్ట్ పేజీలో Galaxy M14 4G, Galaxy F14 4G డివైజెస్ లిస్ట్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.
సపోర్ట్ పేజీ వివరాలు
- Samsung Galaxy M14 4G డివైజ్ కంపెనీ యొక్క వెబ్‌సైట్ లో SM-M146B అనే పేరుతో లిస్ట్ అయ్యింది.
- మరోవైపు Samsung Galaxy F14 4G స్మార్ట్‌ఫోన్ SM-E146B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
- ఈ రెండు ఫోన్ల యొక్క లుక్, డిజైన్ ఒకే విధంగా ఉండనున్నాయని అనుకోవచ్చు.
- రెండు డివైజెస్ లో వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి.
- లిస్టింగ్ ద్వారా మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. ఓసారి Samsung Galaxy M14 5G యొక్క స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.
Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్
- 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే
- 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- ఎగ్జినోస్ 1330 చిప్
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
- 50ఎంపి రియర్ కెమెరా
- 13ఎంపి ఫ్రంట్ కెమెరా
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
డిస్ప్లే: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, సన్నని బెజెల్స్, మందపాటి బాటమ్ చిన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.
ఓఎస్: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ప్రాసెసర్: Samsung Galaxy M14 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. 13 5జీ బ్యాండ్స్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తోంది.
కెమెరా: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.











