
భారత్ లో మరొక 5జీ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17 న Samsung Galaxy M14 5G లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ కి సంబంధించిన ఎన్నో స్పెసిఫికేషన్స్ అఫీషియల్ గా రివీల్ అయ్యాయి. వాటిలో 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధానమైనవి. సరే, మిగతా విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
భారత్ లో Samsung Galaxy M14 లాంచ్ మరియు ధర
భారత్ లో Samsung Galaxy M14 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 17 న లాంచ్ అవుతోంది. అదే రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర, సేల్ వివరాలు కూడా ప్రకటించబడుతాయి. కంపెనీ ప్రొడక్ట్ పేజీ ద్వారా ఈ ఫోన్ ని టీజ్ చేసింది. రూ.13 వేల బడ్జెట్ లో ఈ ఫోన్ సేల్ కి రానుందని సమాచారం. Galaxy M14 ధర రూ.13,999 గా ఉండనుందని మేం అంచనా వేస్తున్నాం.
Samsung Galaxy M14 5G ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- ఎగ్జినోస్ 1330 చిప్
- 13 5జీ బ్యాండ్స్
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
Samsung Galaxy M14 5G లో ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఉంటుంది. ఇది 5 నానో మీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ ఫోన్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది.
ఈ శాంసంగ్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ మరియు 4 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని అందిస్తామని కంపెనీ హామీనిస్తోంది.
- 25వాట్ చార్జింగ్
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 50ఎంపి ట్రిపుల్ కెమెరా
Samsung Galaxy M14 5G డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఈ ఫోన్ ని ఒక్కసారి చార్జ్ చేస్తే 2 రోజుల వరకు పని చేస్తుందని కంపెనీ చెబుతోంది.
Samsung Galaxy M14 5G లో ఫోటోగ్రఫీ కోసం 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











