Home News 6జిబి ర్యామ్ తో భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G; దర్శనమిస్తోన్న సపోర్ట్ పేజీ

6జిబి ర్యామ్ తో భారత్‌లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G; దర్శనమిస్తోన్న సపోర్ట్ పేజీ

Highlights
  • లైవ్ లో దర్శనమిస్తోన్న Samsung Galaxy M14 5G సపోర్ట్ పేజీ
  • సపోర్ట్ పేజీపై కనిపిస్తోన్న 6జిబి ర్యామ్, 4జిబి ర్యామ్ వేరియంట్స్
  • అతిత్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G డివైజ్

ఇటీవలె Samsung Galaxy M14 5G డివైజ్ గ్లోబల్ గా లాంచైంది. ఈ డివైజ్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, శాంసంగ్ ఎగ్జినోస్ 1330 చిప్సెట్, 50ఎంపి కెమెరా తో వచ్చింది. అలాగే ఈ చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లో అతి త్వరలో లాంచ్ కానుంది. Samsung Galaxy M14 5G డివైజ్ శాంసంగ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లో కనిపిస్తోంది. ఈ డివైజ్ 6జిబి/4జిబి ర్యామ్ ఆప్షన్స్ లో వస్తోంది. ఓసారి Samsung Galaxy M14 5G డివైజ్ యొక్క ఇతర వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M14 5G డివైజ్ కంపెనీ యొక్క ఇండియా వెబ్‌సైట్ పై లిస్ట్ కాబడింది. దీంతో అతి త్వరలో Samsung Galaxy M14 5G డివైజ్ మార్కెట్ లో లాంచ్ కానుందని స్పష్టమవుతోంది. రెండు వేరియంట్లలో ఫోన్ లభించనుంది. అవి: 4జిబి ర్యామ్ మరియు 6జిబి ర్యామ్. త్వరలోనే శాంసంగ్ సంస్థ ఈ ఫోన్ లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో 1080*2408 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో కూడిన 6.6-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే తో లాంచైంది. ఈ ఫోన్ స్క్రీన్ పీఎల్ఎస్ ఎల్సీడీ ప్యానెల్ పై తయారైంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. నేవీ బ్లూ, లైట్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. ఈ ఫోన్ 166.8 మిల్లీ మీటర్ల పొడవు, 77.2 మిల్లీ మీటర్ల వెడల్పు, 9.4 మిల్లీ మీటర్ల మందం, 206 గ్రాముల బరువు ఉంటుంది.

Samsung Galaxy M14 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో శాంసంగ్ సొంత చిప్సెట్ అయిన ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ వాడారు. ఈ చిప్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. గ్లోబల్ గా ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీతో లాంచైంది.

Samsung Galaxy M14 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13 ఎంపి కెమెరా ఇచ్చారు. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.