Home News Samsung Galaxy M14 5G డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M14 5G డిజైన్ రెండర్స్, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్

Highlights

రెండర్ ఇమేజెస్ ద్వారా లీకైన Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్

డార్క్ బ్లూ, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Samsung Galaxy M14 5G

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్ తో రానున్న Samsung Galaxy M14 5G

శాంసంగ్ త్వరలోనే ఎమ్-సిరీస్ లో ఒక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. అదే Samsung Galaxy M14 5G. ఈ ఫోన్ కోసం ఎమ్-సిరీస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఇంకా బీఐఎస్ సర్టిఫకేషన్ కూడా పొందింది. ఇప్పుడు, The Tech Outlook Samsung Galaxy M14 5G యొక్క డిజైన్ రెండర్స్ ని రివీల్ చేసింది.

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ రెండర్స్ ద్వారా మూడు కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy M14 5G చూడటానికి ఈ ఏడాది లాంచ్ కాబోవు ఇతర శాంసంగ్ ఎమ్-సిరీస్ ఫోన్ల మాదిరే ఉంది. సరే, ఓసారి Samsung Galaxy M14 5G గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M14 5G డిజైన్ రెండర్స్, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, మందపాటి చిన్ కలిగి ఉంటుంది. ఇది బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ కావున, చిన్ మందంగానే ఉంటుంది. దీనిని పెద్దగా యూజర్లు పట్టించుకునే అవకాశం లేదు.

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. ఫోన్ కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఎంబెడ్ చేయబడి ఉంటుంది.

Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ఇప్పటికే గీక్ బెంచ్ పై కనిపించింది. దీంతో స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్, 4జిబి ర్యామ్ తో వస్తోంది. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

రీసెంట్ గా Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ FIMKO సర్టిఫికేషన్ పై కనిపించింది. ఇందులో 5830 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఎఫ్‌సీసీ సర్టిఫకేషన్ ద్వారా ఈ డివైజ్ 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలిసింది.

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మ్యాక్రో షూటర్ ఉంటాయి. సెల్ఫీస్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. దీంతో ఈ ఫోన్ భారత మార్కెట్ లో లాంచ్ అవ్వనున్న విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే ఈ హ్యాండ్సెట్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్ సైట్ పై కనిపించింది. Samsung Galaxy M14 5G ఫోన్ బ్లూటూత్ 5.2 తో వస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.