హైలైట్స్
- త్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy M14 5G
- Samsung Galaxy M13 5G కి అప్‌గ్రేడెడ్ వర్షన్ గా వస్తోన్న Samsung Galaxy M14 5G
- బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించిన Samsung Galaxy M14 5G
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ త్వరలో Samsung Galaxy M14 5G స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంకా ఈ ఫోన్ లాంచ్ గురించి శాంసంగ్ నుంచి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. అయితే Samsung Galaxy M14 5G బెంచ్ మార్కింగ్ సైట్ అయి గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Samsung Galaxy M14 5G లాంచ్ త్వరలోనే ఉండనుందని స్పష్టమవుతోంది. ఇక గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.
Geekbench పై కనిపించిన Samsung Galaxy M14 5G
Samsung Galaxy M14 5G బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై కనిపించింది. నవంబర్ 17 న ఈ లిస్టింగ్ గుర్తించబడింది. దాని ప్రకారం, Samsung Galaxy M14 5G డివైజ్ SM-M146B అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గీక్ బెంచ్ ద్వారా ఎన్నో ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. Samsung Galaxy M14 5G డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 751 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 2051 పాయింట్లు సాధించింది.
Samsung Galaxy M14 5G స్పెసిఫికేషన్స్
గీక్ బెంచ్ పై కనిపించిన స్పెసిఫికేషన్స్ ని బట్టి, Samsung Galaxy M14 5G ఆండ్రాయిడ్ 13 తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 2.40 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. ఎగ్జినోస్ 1330 చిప్సెట్ ఈ ఫోన్ లో వాడారు. 4జిబి ర్యామ్ వేరియంట్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
Samsung Galaxy M13 5G
Samsung Galaxy M13 5G 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ యూనిట్ ధర రూ.15,999 గా నిర్ణయించారు. రెండు వేరియంట్స్ కూడా రూ.2,000 డిస్కౌంట్ పై లభిస్తున్నాయి. ఈ శాంసంగ్ ఆఫర్ నవంబర్ 30 దాకా కొనసాగుతుంది. డిస్కౌంట్ తో 4జిబి వేరియంట్ ధర రూ.10,999, 6జిబి వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది.
Samsung Galaxy M13 5G లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 50ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.