Home News Samsung: డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy M15 5G

Samsung: డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన Galaxy M15 5G

Highlights
  • నేడు భారత్ లో Samsung Galaxy M15 5G లాంచ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • Galaxy M15 5G ప్రారంభ ధర రూ.13,299

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు కొత్త ఎమ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Samsung Galaxy M15 5G మరియు Samsung Galaxy M55 5G పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు అమెజాన్ తో పాటు కంపెనీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy M15 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ ని కలిగి ఉంది. సరే, ఓసారి డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M15 5G ధర, లభ్యత

Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గెలాక్సీ ఎమ్15 5జీ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.13,299 గా నిర్ణయించారు.

గెలాక్సీ ఎమ్15 5జీ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,799 గా ఉంది.

బ్లూ టోపాజ్, సెలెస్టియల్ బ్లూ మరియు స్టోన్ గ్రే కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

శాంసంగ్ వెబ్‌సైట్, అమెజాన్ మరియు రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, హెచ్డీఎఫ్ఎ‌సీ బ్యాంక్ కార్డ్ పై రూ1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇంకా 3 లేదా 6 నెలల కాలపరిమితితో కూడిన నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.

Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్