ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఒక కొత్త ఎమ్-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Samsung Galaxy M15 5G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి రానుంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించి శాంసంగ్ నుంచి ఇంకా అధికార సమాచారం బయటకు రాలేదు. కానీ, ఈలోపే నెట్టింట్లో లీకులు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ టిప్‌స్టర్ Samsung Galaxy M15 5G లాంచ్ వివరాలను లీక్ చేశారు. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy M15 5G ఇండియా లాంచ్ వివరాలు (లీక్)
Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ఇండియా లాంచ్ వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ లీక్ చేశారు.
Samsung Galaxy M15 5G డివైజ్ భారతీయ మార్కెట్ లో త్వరలో లాంచ్ కానుందని టిప్‌స్టర్ తెలిపారు. Samsung Galaxy M15 5G తో పాటు Samsung Galaxy M55 5G కూడా లాంచ్ అవుతుందన్నారు.
Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి.
Samsung Galaxy M15 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే రూ.14,999 ఉండే అవకాశం ఉంది.
Samsung Galaxy M15 5G డివైజ్ Redmi Note 13 5G, Realme 12 5G ఫోన్లతో పోటీపడనుంది.
[Exclusive] Can confirm that the Galaxy M55 will feature a Snapdragon processor and up to 12GB RAM in India.
Plus, the device will be one of the slimmest Galaxy M-series phones till date. Here are some exclusive device pictures for you.
Can also confirm that the Galaxy M55 won't… pic.twitter.com/tg5IWjBBcI— Mukul Sharma (@stufflistings) March 21, 2024
Samsung Galaxy M15 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy M15 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 396 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy M15 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M15 5G డివైజ్ 4జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది.
- కెమెరా: Samsung Galaxy M15 5G లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- ఓఎస్: Samsung Galaxy M15 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy M15 5G లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy M15 5G లో డ్యూయల్ సిమ్, 4జీ వొల్టీ, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్ మరియు యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
- భద్రత: Samsung Galaxy M15 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
