Home News లాంచ్ కి సిద్ధమవుతోన్న Samsung Galaxy M23 5G, Galaxy A04, Galaxy A04e

లాంచ్ కి సిద్ధమవుతోన్న Samsung Galaxy M23 5G, Galaxy A04, Galaxy A04e

హైలైట్స్

Samsung కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లపై ఫోకస్ పెట్టింది. ఏ-సిరీస్ లో రెండు, ఎమ్-సిరీస్ లో ఒక ఫోన్ ని త్వరలో లాంచ్ చేసేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ కూడా తక్కువ బడ్జెట్ సెగ్మెంట్ లోనివే. Samsung Galaxy M23 5G, Galaxy A04, Galaxy A04e స్మార్ట్ ఫోన్స్ త్వరలోనే భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఈ డివైజెస్ లాంచ్ కి సంబంధించిన ఎటువంటి వివరాలను ఇప్పటి వరకు శాంసంగ్ అధికారికంగా వెల్లడించలేదు. అయితే శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ లో ఈ మూడు డివైజెస్ కనిపించడంతో త్వరలోనే వీటి లాంచ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. త్వరలో రాబోవు ఈ ఫోన్లకు సంబంధించిన సపోర్ట్ పేజెస్ శాంసంగ్ ఇండియా అధికార వెబ్ సైట్ లో కనిపించాయి.

Samsung Galaxy M23 5G ఈ ఏడాది ఆరంభంలో యూరోప్ లోని కొన్ని ప్రాంతాల్లో అన్‌వీల్ అయ్యింది. దీని తర్వాత Galaxy A04 మరియు Galaxy A04e డివైజెస్ కూడా లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ డివైజెస్ భారత్ లో లాంచ్ కాబోతున్నాయి. ఇకపోతే సపోర్ట్ పేజెస్ ని ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు అంబోరే తొలుత గమనించి మోడల్ నంబర్స్ ని రివీల్ చేశాడు. Galaxy M23 5G స్మార్ట్ ఫోన్ SM-M236B/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇక Galaxy A04 SM-A045F/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. చివరగా Galaxy A04e SM-A042F/DS అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది.

Samsung Galaxy M23 5G స్పెసిఫికేషన్స్

Samsung Galaxy M23 5G స్నాప్ డ్రాగన్ 750జి 5జీ చిప్సెట్ తో వస్తోంది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. గెలాక్సీ ఎం23 5జీ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత, వన్ యూఐ 4.1 పై పని చేస్తుంది.

Samsung Galaxy A04e స్పెసిఫికేషన్స్

Galaxy A04e స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. ఇందులో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 13ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy A04 స్పెసిఫికేషన్స్

Samsung Galaxy A04 ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ తో వస్తోంది. ఇందులో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.