Home News Samsung Galaxy M35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు

Samsung Galaxy M35 5G గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ వివరాలు

Highlights
  • త్వరలో Samsung Galaxy M35 5G లాంచ్
  • శాంసంగ్ ఎగ్జినోస్ 1380 చిప్సెట్‌
  • ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నుంచి త్వరలో ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Samsung Galaxy M35 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్ తో పాటు ఇతర వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M35 5G డిజైన్ (లీక్)

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై ఇమేజ్ తో సహా లిస్ట్ అయ్యింది. ఇమేజ్‌ని గమనిస్తే, బ్యాక్ ప్యానెల్ పై 3 కెమెరాలు ఉన్నాయి. వాల్యూమ్ బటన్ ఫోన్‌కి కుడివైపున ఉంది. ఫోన్ ముందువైపున సెంటర్ పంచ్ హోల్ కటౌట్, కాస్త మందపాటి బెజెల్స్ కనిపిస్తున్నాయి.

Samsung Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ సపోర్ట్ పేజీపై SM-M356B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy M35 5G ఎగ్జినోస్ 1380 చిప్సెట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy M35 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Samsung Galaxy M35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M35 5G డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M35 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఉండే కెమెరా సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుందని అంచనా.

ఓఎస్: Samsung Galaxy M35 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవ్వనుంది.

ఇటీవలె లాంచైన Samsung Galaxy A35 5G కి రీబ్రాండ్ వర్షన్‌గా Samsung Galaxy M35 5G మార్కెట్ లోకి రాబోతోంది. Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ పంచ్ హోల్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (2340*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1380 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.

Samsung Galaxy A35 5G పూర్తి స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్ (1080*2340 పిక్సెల్స్), 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, విజన్ బూస్టర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: Samsung Galaxy A35 5G లో 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy A35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6, గ్లొనాస్, బైడూ, గెలీలియో, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్: Samsung Galaxy A35 5G ఆసమ్ ఐస్‌బ్లూ, ఆసమ్ లైలాక్, ఆసమ్ నేవీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.