
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా రెండు స్మార్ట్‌ఫోన్ల ధరను తగ్గించింది. మీరు గనుక శాంసంగ్ ఫోన్ కొనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. Samsung Galaxy M55 5G పై రూ.4,000 మరియు Samsung Galaxy F55 5G పై రూ.2,000 లను శాంసంగ్ తగ్గించింది. అయితే ఈ ఆఫర్లు పరిమిత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జులై 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తగ్గింపు ధరలో ఈ ఫోన్లు లభిస్తాయి. మరి కొత్త ధర వివరాలు తెలుసుకుందామా?
Samsung Galaxy M55 5G ధర తగ్గింపు వివరాలు
Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.4,000 తగ్గింపు తర్వాత రూ.22,999 కి చేరింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.26,999 గా ఉంది.
Samsung Galaxy M55 5G యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర ప్రస్తుతం రూ.25,999 గా ఉంది. లాంచ్ ధర రూ.29,999 గా ఉంది.
టాప్ వేరియంట్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.28,999 గా ఉంది. లాంచ్ టైమ్‌లో ఈ ఫోన్ ధర రూ.32,999 గా ఉంది.
Samsung Galaxy F55 5G ధర తగ్గింపు వివరాలు
Samsung Galaxy F55 5G డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.2,000 తగ్గింపు తర్వాత రూ.24,999 కి చేరింది. లాంచ్ టైమ్‌లో దీని ధర రూ.26,999 గా ఉంది.
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం రూ.27,999 కి అందుబాటులో ఉంది. లాంచ్ సమయంలో దీని ధర రూ.29,999 గా ఉంది.
ధర తగ్గింపు తర్వాత, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.30,999 కి చేరింది. ఈ ఫోన్ రూ.32,999 ధరతో లాంచ్ అయ్యింది.
రెండు ఫోన్లపై ఈ ఆఫర్ జులై 9 నుంచి 13 వరకు అన్ని రిటైల్ ఔట్‌లెట్స్ లో అందుబాటులో ఉంటుంది. కొన్ని ఆన్‌లైన్ వేదికలపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1080*2400 పిక్సెల్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్+ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 16 మిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
రియర్ కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి.
ఫ్రంట్ కెమెరా: సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ కి 4 మేజర్ ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
బ్యాటరీ: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అందించిన సూపర్ ఫాస్ట్ చార్జింగ్ 2.0 టెక్నాలజీ కేవలం బ్యాటరీని ఫాస్ట్ గా చార్జ్ చేయడమే కాదు, ఇంకా వేడెక్కకుండా చూస్తుంది.
కనెక్టివిటీ: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 5Ghz, యూఎస్బీ టైప్-సీ 2.0, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
Samsung Galaxy F55 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy F55 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్లస్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy F55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy F55 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Samsung Galaxy F55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Samsung Galaxy F55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Samsung Galaxy F55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy F55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.