
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung ఎమ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Galaxy M55 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. త్వరలో భారత్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా Samsung Galaxy M55 5G యొక్క ప్రొడక్ట్ పేజీ అమెజాన్ లో దర్శనమిస్తోంది. దీంతో డివైజ్ యొక్క ఫోటో, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy M55 5G ఇండియా లాంచ్ వివరాలు
Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ తో వస్తోందని కంపెనీ వెల్లడించింది. అయితే కచ్చితమైన లాంచ్ తేదీని శాంసంగ్ ప్రకటించలేదు. #MustBeAMonster అని హ్యాష్‌ట్యాగ్ ని కంపెనీ డివైజ్ తో పాటు టీజ్ చేసింది. Samsung Galaxy M55 5G డివైజ్ రిటైల్ స్టోర్స్ తో పాటు, అమెజాన్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy M55 5G ఇండియా ధర (లీక్)
Samsung Galaxy M55 5G ధరను టిప్‌స్టర్ సుదాన్శు లీక్ చేశారు. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy M55 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది. 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంటుంది. టాప్ వేరియంట్ 12జిబి+256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.32,999 గా ఉండవచ్చు.
Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- డిస్ప్లే: Samsung Galaxy M55 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ ప్లస్ స్క్రీన్, పంచ్-హోల్ డిజైన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Samsung Galaxy M55 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M55 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Samsung Galaxy M55 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్ వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. - ఓఎస్: Samsung Galaxy M55 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 6.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బరువు, మందం: Samsung Galaxy M55 5G 180 గ్రాముల బరువు, 7.8మి.మీ మందం ఉంటుంది.
- ఇతర పీచర్లు: Samsung Galaxy M55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి.












