Home News Samsung: 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy M55 5G

Samsung: 50MP సెల్ఫీ కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy M55 5G

Highlights
  • భారత్‌లో Samsung Galaxy M55 5G లాంచ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్
  • డివైజ్ ప్రారంభ ధర రూ.26,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు భారతీయ మార్కెట్ లో రెండు ఎమ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. Samsung Galaxy M55 5G, Samsung Galaxy M15 5G అనే పేర్లతో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy M55 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్, 6.7-ఇంచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy M55 5G ధర, కలర్ ఆప్షన్స్

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఓసారి వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy M55 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.26,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.32,999 గా నిర్ణయించారు.

Samsung Galaxy M55 5G స్మార్ట్‌ఫోన్ లైట్ గ్రీన్ మరియు డెనిమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రారంభ సేల్‌లో భాగంగా కంపెనీ రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Samsung Galaxy M55 5G స్పెసిఫికేషన్స్