Home News Samsung Galaxy M55s: లాంచ్‌కి ముందు లీకైన ధర, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్

Samsung Galaxy M55s: లాంచ్‌కి ముందు లీకైన ధర, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్

Highlights
  • త్వరలో Samsung Galaxy M55s విడుదల
  • లీకైన ధర, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్
  • 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎమ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy M55s పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ ఇప్పటికే శాంసంగ్ వెబ్‌సైట్ పై కనిపించింది. తాజాగా, గెలాక్సీ ఎమ్55ఎస్ ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఇమేజెస్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy M55s ధర శ్రేణి (లీక్)

Samsung Galaxy M55s ధరకు సంబంధించిన వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన X ఖాతా ద్వారా షేర్ చేశారు.

ముకుల్ పోస్ట్ ప్రకారం, Samsung Galaxy M55s డివైజ్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ధర రూ.20,000 రేంజ్ లో ఉంటుందని అతడి పోస్ట్ ద్వారా తెలిసింది.

Samsung Galaxy M55s డిజైన్ (లీక్)

Samsung Galaxy M55s డిజైన్ విషయానికి వస్తే, లీకై పిక్చర్స్ లో బ్లాక్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ టోన్ ఫినిషింగ్, రెక్టాంగ్యులర్ స్ట్రిప్ కనిపించాయి. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ముందువైపు, అమోలెడ్ స్క్రీన్ ఉంది.

Samsung Galaxy M55s స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Samsung Galaxy M55s లో సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియలేదు.

ప్రాసెసర్: Samsung Galaxy M55s డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: Samsung Galaxy M55s లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy M55s డివైజ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M55s లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.