Home News నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy S21 FE Snapdragon 888 మోడల్!

నేడు భారత్‌లో లాంచైన Samsung Galaxy S21 FE Snapdragon 888 మోడల్!

Highlights
  • స్నాప్ డ్రాగన్ 888 చిప్ తో వచ్చిన Samsung Galaxy S21 FE
  • గతేడాది Exynos 2100 చిప్‌తో భారత్‌లో లాంచైన డివైజ్
  • భారత్ లో Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ ఎడిషన్ ధర రూ.49,999

ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్ నేడు భారత్ లో Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ 888 ఎడిషన్ ని లాంచ్ చేసింది. గతేడాది, Samsung Galaxy S21 FE ఎగ్జినోస్ 2100 చిప్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు స్నాప్ డ్రాగన్ 888 చిప్సెట్ తో Samsung Galaxy S21 FE భారతీయ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. ఒక్క చిప్సెట్ తప్పితే, మిగతా స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అన్నీ రెండు వేరియంట్స్ లోనూ ఒకే విధంగా ఉంటాయి.

Samsung Galaxy S21 FE లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి. సరే, ఓసారి Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ వేరియంట్ ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

భారత్ లో Samsung Galaxy S21 FE ధర, లభ్యత

Samsung Galaxy S21 FE డివైజ్ ఆలివ్, గ్రాఫైట్, లావెండర్, నేవీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. భారత్ లో Samsung Galaxy S21 FE స్నాప్ డ్రాగన్ ఎడిషన్ ధరను రూ.49,999 గా నిర్ణయించారు. ఈ హ్యాండ్సెట్ ని శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ మరియు రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ లో భాగంగా హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై రూ.5,000 క్యాష్‌బ్యాక్ కస్టమర్లకు లభిస్తుంది. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Samsung Galaxy S21 FE స్పెసిఫికేషన్స్