Home News ఎగ్జినోస్ 2300 చిప్, 108ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S22 FE (లీక్డ్)

ఎగ్జినోస్ 2300 చిప్, 108ఎంపి కెమెరాతో రానున్న Samsung Galaxy S22 FE (లీక్డ్)

హైలైట్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన ఫ్లాగ్షిప్ శ్రేణి Galaxy S22 సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ లైనప్ లో Samsung Galaxy S22, Samsung Galaxy S22 Plus, Samsung Galaxy S22 Ultra అనే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు శాంసంగ్ Samsung Galaxy S22 FE వర్షన్ ని లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. మరోవైపు Samsung Galaxy S23 ఫిబ్రవరి 1 న యూఎస్ తో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ అవుతోంది.

Samsung Galaxy S23 లాంచ్ సమయంలోనే Samsung Galaxy S22 FE లాంచ్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మధ్య శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ సిరీస్ లను రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, వాటిపై శాంసంగ్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా Samsung Galaxy S22 FE లాంచ్ అవుతోందంటూ ఓ నివేదిక స్పష్టం చేసింది. ఈ డివైజ్ 2023 ఫిబ్రవరిలో లాంచ్ అవ్వనుంది.

టిప్‌స్టర్ EGcloudS (ఈజీక్లౌడ్స్) ద్వారా Samsung Galaxy S22 FE సంబంధించిన లీక్ బయటకు వచ్చింది. ఈ డివైజ్ కోసం శాంసంగ్ అన్‌ప్యాక్డ్-పార్ట్ 2 ఈవెంట్ ని నిర్వహించే అవకాశం ఉన్నట్లు టిప్‌స్టర్ అంచనా వేశాడు.

టిప్‌స్టర్ ప్రకారం, శాంసంగ్ సంస్థ Samsung Galaxy A74 ని నిలిపివేసి ఆ స్థానంలో Samsung Galaxy S22 FE ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శాంసంగ్ తన A7x సిరీస్ ని రద్దు చేయడంతో ఇకపై ఏ-సిరీస్ 2023 లో లాంచ్ కాబోయే A54 టాప్ మోడల్ గా కొనసాగనుంది.

చాలా మార్కెట్స్ లో Galaxy A7x సిరీస్ ధర ఎస్-సిరీస్ ఎఫ్ఈ వేరియంట్స్ ధరలకు సమీపంలో ఉంటున్నాయి. దీంతో శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ఎఫ్ఈ వేరియంట్ ని గెలాక్సీ ఎస్22 కంటే తక్కువ ధరలో తీసుకొస్తూ, ఫ్లాగ్షిప్ ఎక్స్‌పీరియన్స్ ని అందించనున్నారు.

Samsung Galaxy S22 FE స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

Samsung Galaxy S22 FE స్మార్ట్ ఫోన్ ఎగ్జినోస్ 2300 చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. ఇకపోతే Samsung Galaxy S23 సిరీస్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ని వినియోగించబోతున్నారు. దీంతో ఈ సిరీస్ ఎగ్జినోస్ 2300 చిప్సెట్ తో రాదని కన్ఫర్మ్ అయ్యింది.

ఎగ్జినోస్ 2300 చిప్సెట్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైన చిప్. అయితే కచ్చితమైన పెర్ఫామెన్స్ వివరాలు ఇంకా తెలియలేదు. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ఎఫ్ఈ లో కూడా ఇదే చిప్సెట్ వాడినట్లు సమాచారం.

Samsung Galaxy S22 FE శాంసంగ్ యొక్క సొంత 108ఎంపి హెచ్ఎం6 సెన్సర్ తో రాబోతోంది. అయితే ఈ వివరాలన్నీ టిప్‌స్టర్ వెల్లడించినవని గమనించాలి. శాంసంగ్ నుంచి అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. అప్పుడే Samsung Galaxy S22 FE పై స్పష్టత వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.