ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S22 ధరను తగ్గించింది. గతంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.71,999 కాగా, ప్రస్తుతం రూ.63,999 కి లభిస్తోంది. అంటే కంపెనీ ఈ ఫోన్ పై నేరుగా రూ.8,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అయితే కంపెనీ నుంచి ఈ డిస్కౌంట్ కి సంబందించి ఇంకా అధికార ప్రకటన రాలేదు. కానీ, మాకు ఈ సమాచారం ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా అందింది.
ఢిల్లీకి చెందిన ఒక రిటైలర్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ద్వారా ధర తగ్గింపు గురించి తెలిసింది.
Samsung Galaxy S22 ఆఫ్లైన్ ధర
- శాంసంగ్ కంపెనీ కి చెందిన ఫ్లాగ్షిప్ ఫోన్ ని కొనాలని మీరు భావిస్తుంటే గనుక, ఇదే మంచి సమయం. ఫోన్లపై ఆఫ్లైన్, ఆన్లైన్ స్టోర్స్ ద్వారా భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.
- ఆఫ్లైన్ గురించి మాట్లాడితే, Galaxy S22 8జిబి + 128జిబి వేరియంట్ పాత ధర రూ.71,999 గా ఉంది. ఇప్పుడు రూ.8,000 తగ్గింపుతో ఈ ఫోన్ ధర రూ.63,999 కి చేరింది.
- Samsung Galaxy S22 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.75,999 గా ఉంది. డిస్కౌంట్ తర్వాత దీని ధర రూ.67,999 కి తగ్గింది.
- అయితే, దీంతో పాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ లను కూడా ఆఫ్లైన్ స్టోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఆఫర్స్ తర్వాత రూ.60,000 కంటే తక్కువ ధరకే ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S22 ఆన్లైన్ ధర
- ఆన్లైన్ లో Samsung Galaxy S22 ఫ్లాగ్షిప్ డివైజ్ పై భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. Samsung Galaxy S22 ఫోన్ 8జిబి+128జిబి గ్రీన్ కలర్ వేరియంట్ ని రూ.49,490 కే సొంతం చేసుకోవచ్చు.
- ఫ్లిప్కార్ట్ లో 8జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.59,999 గా ఉంది. ఇంకా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి. బోరా పర్పుల్, గ్రీన్, పింక్ గోల్డ్, ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ వైట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
Samsung Galaxy S22 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Samsung Galaxy S22 లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- మెమొరీ, ప్రాసెసర్: Samsung Galaxy S22 8జిబి+128జిబి మరియు 8జిబి+256జిబి వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ వాడారు.
- కెమెరా: Samsung Galaxy S22 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 10ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి కెమెరా ఉంది.
- ఓఎస్: Samsung Galaxy S22 డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత వన్యూఐ 4.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Samsung Galaxy S22 లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Samsung Galaxy S22 లో 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, వై-ఫై, యాక్సలరో మీటర్, బారోమీటర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, జైరో సెన్సర్, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్ ఉన్నాయి.
